BigTV English

Vijay Devarakonda: అంటే.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నాడా.. ?

Vijay Devarakonda: అంటే.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నాడా.. ?

Vijay Devarakonda: మొదటి నుంచి కూడా ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు నెగటివిటీ ఎక్కువ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో స్టేజిమీద విజయ్ మాట్లాడిన మాటలకు.. ఫ్యాన్స్ చొక్కాలు చింపుకున్నారు. సినిమా పరముగా కాకపోయినా.. విజయ్ యాటిట్యూడ్ కు ఫిదా అయిపోయి.. ఫ్యాన్స్ గా మారినవారు ఉన్నారు.


ఇక లైగర్ వరకు ఒక లెక్క.. లైగర్ తరువాత ఒక లెక్కగా మారిపోయింది విజయ్ జీవితం. లైగర్.. విజయ్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా తరువాత విజయ్ లో ఉన్న యాటిట్యూడ్ కొంతవరకు తగ్గింది. అంతకు ముందులా అంత జోష్ గా మాట్లాడడం లేదన్నది నమ్మదగ్గ నిజం.

లైగర్ ప్లాప్ తో కుదేలయిన విజయ్.. మళ్లీ తన మార్క్ ను, మార్కెట్ ను పెంచాలని చూస్తూ వస్తున్నాడు. కానీ, అది అవ్వడం లేదు, ఈ ఏడాది వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా అంతంత మాత్రంగానే వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం మన రౌడీ ఆశలన్నీ VD 12 మీదనే పెట్టుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే.. ఎవరు ఊహించని రీతిలో కల్కిలో అర్జునుడిగా మెరిశాడు.


థియేటర్ లో అర్జునుడుగా విజయ్ ఎంట్రీ ఇవ్వగానే ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు. అశ్వత్థామ అంటూ డైలాగ్ చెప్పడంతో.. ఇలాంటి పాత్రలో రౌడీ హీరోను అస్సలు ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం సగానికి పైగా ప్రేక్షకులు విజయ్.. అర్జునుడుగా సెట్ అవ్వలేదని చెప్పుకొస్తున్నారు. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ.. అస్సలు సెట్ కాలేదని, ఆ పాత్రలో వేరే హీరో ఉంటే మరింత ఇంపాక్ట్ ఉండేదని, అతనిని చుస్తుంటే కామెడీగా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ ట్రోల్స్ కు విజయ్ సైలెంట్ కౌంటర్ ఇచ్చాడు. కల్కి సినిమా చూసాక.. అర్జునుడు పాత్రలో ఉన్న తన ఫోటోను ఇన్‍స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లకు డీపీ (డిస్‍ప్లే పిక్చర్)గా పెట్టేశాడు. అంటే.. ఎన్ని అన్నా.. అలాంటి ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోను..ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు ఆ ఫోటోను పెట్టాడని చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు ఇలాంటి ట్రోల్ చేసినా నన్నేం చేయలేరు అని చెప్తున్నాడని అంటున్నారు. ఏదిఏమైనా విజయ్ తీరు వేరు.. దారి వేరు. మరి తన తదుపరి చిత్రంతోనైనా ఎలాంటి ట్రోల్స్ లేకుండా హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×