Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన వెనుక అసలు మర్మం ఏమిటి? అది కూడ ఆరోగ్యం బాగా లేదని ఇటీవల డిప్యూటీ సీఎంఓ కార్యాలయం ప్రకటించిన నేపథ్యంలో, హఠాత్తుగా పవన్ ఎందుకు ఈ పర్యటన ఖరారు చేసుకున్నారు? ఈ పర్యటన వెనుక బీజేపీకి ప్రచారం సాగించడమే లక్ష్యమా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నోట వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ వీటికి సమాధానమిచ్చారు.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఏపీ కేబినెట్ భేటీకి కూడ పవన్ గైర్హాజరయ్యారు. అంతేకాదు పలు సమీక్షలకు కూడ రాలేదు. తీవ్రమైన జ్వరంతో పవన్ ఇబ్బంది పడుతున్నారని, అలాగే పవన్ కు వెన్నునొప్పి ఉందని డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటించింది. పవన్ రెస్ట్ తీసుకుంటున్నారని అందరూ అనుకుంటుండగా, హఠాత్తుగా పలు ఆలయాల సందర్శనకు పవన్ శ్రీకారం చుట్టారు. ఆరోగ్యం సహకరించడం లేదన్న సమయంలో పవన్ పర్యటన ఖరారు కావడంతో.. దీని వెనుక రహస్య ఎజెండా ఉందని ప్రచారం సాగుతోంది.
కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలను పవన్ సందర్శించనున్నారు. బుధవారం పవన్ కేరళ లోని అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌తో పాటు కుమారుడు అకీరా నందన్, టీటీడీ సభ్యుడు ఆనందసాయి కూడ ఈ పర్యటనలో ఉన్నారు. అయితే ఆలయం సమీపంలో మీడియా పలకరించగా పవన్ మాట్లాడారు. బీజేపీ ప్రచారం కోసం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించడం లేదని, ఇది కేవలం ఆలయాల సందర్శన మాత్రమే.. రాజకీయాలకు సంబంధం లేదన్నారు. నాలుగున్నరేళ్ల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసమే వచ్చానన్నారు.
ఇక తిరుమల లడ్డూ కల్తీ నిజంగా దురదృష్టకరమని పవన్ మరోమారు అభిప్రాయపడ్డారు. ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు అనేదే తన ఆవేదన అన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. కాగా ఇప్పటికే తిరుమల లడ్డు విషయంలో సిట్ విచారణ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికే నలుగురిని సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడ తరలించింది. ఇదే అంశంపై మరికొన్ని అరెస్ట్ లు ఉంటాయని ప్రచారం సాగుతోంది.
Also Read: YS Jagan Comments: సీఎం చంద్రబాబుపై 420 కేసు.. జగన్ డిమాండ్
ఇది ఇలా ఉంటే పవన్ పర్యటన ఆకస్మాత్తుగా ఖరారు కావడంతో జనసేన క్యాడర్ కూడ కాస్త ఆశ్చర్యానికి లోనైంది. ఓ వైపు సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పవన్ అనారోగ్యంకు గురికావడం, ఆ తర్వాత వెనువెంటనే ఆలయాల సందర్శనకు వెళ్లడంపై పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ.. గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లించుకొనేందుకే పర్యటనకు వచ్చినట్లు పవన్ తేల్చి చెప్పడంతో.. ఇదా అసలు సంగతి అంటూ రాజకీయ విశ్లేషకులు నిట్టూరుస్తున్నారు. మొత్తం మీద పవన్ ఆలయాల సందర్శన పూర్తి చేసుకొని, మళ్ళీ ప్రభుత్వ పరమైన అంశాలపై దృష్టి సారిస్తారని జనసేన నాయకులు అంటున్నారు.
బీజేపీ ప్రచారం కోసం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించడం లేదు.
ఇది కేవలం ఆలయాల సందర్శన మాత్రమే.. రాజకీయాలకు సంబంధం లేదు
నాలుగున్నరేళ్ల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసమే వచ్చాను
తిరుమల లడ్డూ కల్తీ నిజంగా దురదృష్టకరం
ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే కోట్లాది మంది… https://t.co/DiH0Hd7YL3 pic.twitter.com/qbqlM8xh0g
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025