Kadhalikka Neramillai OTT : జయం రవి (Jayam Ravi), నిత్యా మీనన్ (Nitya Menen) జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కాదలిక్క నేరమిల్లై’ (Kadhalikka Neramillai). కృతిగ ఉదయనిది దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న థియేటర్లలోకి వచ్చింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ (Netflix) లోనూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ రొమాంటిక్ మూవీ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? అనే విషయాన్ని చూద్దాం.
కథ
ఆర్కిటెక్ట్ గా చెన్నైలో పని చేసే అమ్మాయి శ్రియ. తల్లిదండ్రులతో కలిసి నివసించే ఈ అమ్మాయికి ఇండిపెండెంట్ గా ఉండడం అంటేనే ఇష్టం. ఆమె కరణ్ అనే అబ్బాయితో ఈ అమ్మాయి ప్రేమలో పడుతుంది. ఎంగేజ్మెంట్ జరిగాక అతని నిజ స్వరూపం తెలిసి బ్రేకప్ చెప్పేస్తుంది.
బెంగళూరులో నివసించే మరో ఆర్కిటెక్ట్ సిద్ధార్థ్. సిద్ధార్థ్, సేతు ఇద్దరూ ఫ్రెండ్స్. ఓసారి సేతుతో కలిసి వెళ్లిన సిద్ధార్థ్ తప్పక స్పెర్మ్ డొనేట్ చేస్తాడు. కానీ ఆ టైంలో హాస్పిటల్లో తన వివరాలు తప్పుగా ఇస్తాడు. మరోవైపు టెస్ట్ ట్యూబ్ బేబీనీ కనలని డిసైడ్ అవుతుంది శ్రియా. ఈ నేపథ్యంలోనే ఆమె తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు తెలుసుకొని పనిలో పడుతుంది. సిద్ధార్థ్ నిరుపమతో ప్రేమలో ఉంటాడు. కానీ అతనికి పిల్లలు ఇష్టం లేకపోవడం వల్ల ఆమె దూరమవుతుంది. ఇంకొకవైపు శ్రియా మగ బిడ్డకు జన్మనిస్తుంది.
కొన్నేళ్ళ తరువాత సిద్ధార్థ్ చెన్నైకి వెళ్లగా అక్కడ ఇద్దరికీ పరిచయం ఏర్పడి, దగ్గరవుతారు. ఇలాంటి టైంలో సిద్ధార్థ జీవితంలోకి నిరుపమ రీఎంట్రీ ఇవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రియ బిడ్డకి తండ్రి ఎవరు? అనే విషయాలని మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?
సహజత్వానికి దగ్గరగా ఉండే విధంగా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించారు. హీరో హీరోయిన్ల మధ్య మెయిన్ స్టోరీ ని నడుపుతూ, అనవసరమైన క్యారెక్టర్ లు మధ్యలో రాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ కథలో కామెడీ ఓకే కానీ, ట్విస్ట్ లు ఎక్కువగా ఉండవు. హీరోయిన్ కి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అనే క్యూరియాసిటీ మూవీని చూసేలా చేస్తుంది. సున్నితమైన భావోద్వేగాలు, విలువలు, అభిప్రాయాలు, నిర్ణయాలు, ఒకరి నిజాయితీని మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగడం వంటి అంశాల ఆధారంగా డైరెక్టర్ స్టోరీని నడిపించారు.
ఇక ఇందులో నిత్యామీనన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. అలాగే జయం రవి కూడా బాగా నటించాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. సంగీతం, ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. చివరగా… ఇప్పటికే టెస్ట్ ట్యూబ్ బేబీ కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు ఓన్లీ రొమాన్స్ ని బేస్ చేసుకోకుండా ఫీల్ గుడ్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకులకు అందించాడు. అదిరిపోయింది అనే రేంజ్ లో కాకపోయినా మూవీ ఫర్వాలేదు అనిపిస్తుంది. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడగలిగే మూవీ ఇది.