BigTV English

Vijay Setupathi: మహారాజ కోసం రూపాయి కూడా తీసుకొని విజయ్ సేతుపతి.. ఎందుకో తెలుసా.. ?

Vijay Setupathi: మహారాజ కోసం రూపాయి కూడా తీసుకొని విజయ్ సేతుపతి.. ఎందుకో తెలుసా.. ?

Vijay Setupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్.. నెమ్మదిగా హీరోగా మారాడు. ఇండస్ట్రీలో ఒక సినిమా హీరోగా చేయగానే.. మరో క్యారెక్టర్ చేయను అని చెప్పే నటులు ఉన్న ఈరోజుల్లో కథ నచ్చితే.. తన పాత్రలో న్యాయం ఉందని నమ్మితే విజయ్ సేతుపతి ఎలాంటి క్యారెక్టర్ చేయటానికి అయినా వెనుకాడడు.


హీరోగా చేస్తూనే.. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో మెప్పిస్తున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ అని భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ లిస్ట్ లో విజయ్ నటించిన మహారాజ ఒకటి. కూతురు కు జరిగిన అన్యాయాన్ని ఒక తండ్రి ఎలా ఎదిరించాడు అనేది ఎంతో హృద్యంగా చూపించారు. ఇందులో విజయ్ సేతుపతి నటనకు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.

ఇంత మంచి సినిమాకు విజయ్.. ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడో అని అనుకున్నవారికి షాక్. అసలు ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. మొదట మహారాజ సినిమా బడ్జెట్ రూ. 20 కోట్లు అంట. ఇక అందులో హీరోగా తన రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి.. పారితోషికం తీసుకుంటే నిర్మాతలకు మరింత బడ్జెట్ పడుతుంది. సినిమా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. దీంతో విజయ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడట.


సింగిల్ రూపాయి కూడా తీసుకోకుండా మహారాజను ఫినిష్ చేసాడట. సినిమా హిట్ అయితే లాభాల్లో షేర్ తీసుకుంటానని, ఒకవేళ ప్లాప్ అయితే.. సినిమా నేను చేసినట్లు మర్చిపొమ్మని చెప్పినట్లు టాక్. అనుకున్నట్లుగానే సినిమా మంచి విజయం అందుకుంది. దీంతో సదురు నిర్మాతలు.. లాభాల్లో వాటాను విజయ్ కు అందించనున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి విజయ్ చేసిన ప్రయత్నం హర్షించదగ్గది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×