Lakshmi Manchu: టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నది. వీటిని ప్రమోట్ చేసేవాళ్లపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో తాజాగా 11 మందికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మంచు లక్ష్మి కూడా చేరినట్లు తెలుస్తుంది. ఆమె బెట్టింగ్ యాప్ నీ ప్రమోట్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
మంచు లక్ష్మీ సినిమాలు..
టాలీవుడ్ హీరోయిన్ మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చి తన టాలెంట్ తో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం సినిమా ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందా మంచు లక్ష్మి తన లేటెస్ట్ ఫోటోలను తన పర్సనల్ విషయాలు గురించి షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా మంచు లక్ష్మీ ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న వీడియో ఒకటీ నెట్టింట ప్రత్యేక్ష మైంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు..
Also Read : రన్యా రావు కేసులో మరో ట్విస్ట్.. తెలుగు నటుడు అరెస్ట్..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ..
వైరల్ అవుతున్న మంచు లక్ష్మీ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఇది ఒక మంచి ప్లాట్ఫారం మనీని ఎర్న్ చేసుకోవడానికి అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది అంటూ యోలో 247 అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసింది. ఆ వీడియోని ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో మంచు లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇప్పటివరకు బెట్టింగ్ యాప్ లు ప్రమోషన్ చేస్తున్న 11మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో విష్ణుప్రియ, బండారు శేషసాయిని సుప్రిత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి , టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుదీర్ లపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు..
ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పల పాలై తెలంగాణలో గతేడాది వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు.. ఇలాంటివి మళ్లీ రిపీట్ అవ్వకూడదు అనే పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.