Dragon Movie OTT : తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ పేరు ఇప్పుడు తెగ వినిపిస్తుంది. ఈరోజు హీరో తాజాగా నటించిన మూవీ ‘డ్రాగన్’.. ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన ఈ మూవీ నాలుగు వారాలైనా కూడా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గలేదు. రిలీజ్ అయిన మొదటి షో నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతున్న ఈ మూవీ 150 కోట్లకు క్లబ్ లోకి చేరింది. రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు అన్న విషయం తెలిసిందే. చిన్న బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్ద సినిమాలకు వచ్చిన రేంజ్ నే వసూళ్లు వస్తుండటం విశేషం.. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ లాక్ చేశారు. ఎప్పుడు? ఎక్కడ? స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
డ్రాగన్ మూవీ ఓటీటీ..
ప్రదీప్ రంగనాథన్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు, నిర్మాత అర్చనా కల్పతిలను డైరెక్టర్ శంకర్ కూడా మెచ్చుకున్నారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ ను అందుకుంటుంది. దాంతో ఈ మూవీపై అందరి దృష్టి పడింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది..
Read Also :బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న మంచు లక్ష్మీ.. అరెస్ట్ తప్పదా..?
మూవీ స్టోరీ విషయానికొస్తే..
హీరోకు ఇంటర్ లో 96 శాతం మార్కులు వస్తాయి. తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి బ్రేకప్ చెప్పేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. జీవితం లో ఎలాగైనా పైకి రావాలని ఫేక్ సర్టిఫికెట్లను బట్టి ఒక జాబ్ ని సంపాదిస్తాడు అందులో తన తెలివితేటలతో అత్యున్నత స్థాయికి వెళ్తాడు ఇల్లు కారు అన్ని సొంతంగా తీసుకుంటాడు.. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవితో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది.. ఆ తర్వాత అతను సబ్జెక్టులు పాస్ అయ్యాడా లేదా అన్నది ఈ మూవీ స్టోరీలో చూడాలి.. థియేటర్లలో మంచి టాప్ న అందుకున్న ఈ మూవీ ఓటిటి లో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..