E-Paper
Advertisement

Vijay Sethupathi: మరో హిట్ కొట్టేసిన విజయ్ సేతుపతి.. మహారాజా అదిరింది

Vijay Sethupathi: మరో హిట్ కొట్టేసిన విజయ్ సేతుపతి.. మహారాజా అదిరింది
Advertisement

Vijay Sethupathi: హీరోలందరి యందు విజయ్ సేతుపతి వేరయా.. అంటే నిజమే అంటారు. అందుకు కారణం అతను ఎంచుకొనే కథలు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా మారి.. ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న ఏ హీరో కూడా.. విజయ్ సేతుపతిలా సినిమాలు చేయలేడు. కథ నచ్చితే.. అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే.. అది ఎలాంటి పాత్ర అయినా కూడా చేయడానికి విజయ్ సేతుపతి వెనుకాడడు. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్ .. ఏదైనా సరే రెడీ అంటాడు. అలా ఆయన ఏ సినిమా చేస్తే ఆ సినిమా హిట్ కావడం పక్కా.

తాజాగా విజయ్ సేతుపతి నటించిన మహారాజా కూడా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుని విజయం వైపు దూసుకెళ్తోంది. నిదిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువ అయ్యాయి. ఇక ట్రైలర్ లో నా లక్ష్మీ పోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన హీరో.. ఆ లక్ష్మీ ఎవరు అనేది చెప్పకుండా సినిమాపై ఆసక్తి పెంచారు.

Advertisement

ఈరోజు థియేటర్ లో ఆ లక్ష్మీ ఎవరో చూసి అభిమానులు ఖంగుతిన్నారు. డైరెక్టర్ కథను నేరేట్ చేసిన విధానం, విజయ్ సేతుపతి నటన వెరసి సినిమా సూపర్ హిట్ అయ్యేలా కనిపిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. కథ రొటీన్ అయినా చూపించిన విధానం బావుందని చెప్పుకొస్తున్నారు. కామెడీ,తండ్రి కూతుళ్ళ ఎమోషన్, సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యిందని అంటున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో ది బెస్ట్ స్క్రీన్ ప్లే తో వచ్చిన సినిమాలలో ఒకటిగా ఈ మహారాజా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం విశేషం. మంచి టాక్ రావడంతో కలక్షన్స్ కూడా ఆ రేంజ్ లోనే రానున్నాయి. మరి ఆ కలక్షన్స్ వివరాలు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు.. వస్తాడు.. హిట్ కొడతాడు.. రిపీట్.. ఈయనకు ఇదే పని చెప్పుకొస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×