BigTV English

Vijay Sethupathi hit movie: ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి హిట్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Vijay Sethupathi hit movie: ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి హిట్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Vijay Sethupathi maharaja movie OTT(Today tollywood news): మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’. ఈ మూవీకి నిథిలన్ సామినాథన్ దర్శకత్వం వహించగా..ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించారు. జూన్ 14న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు రూ.100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.


తాజాగా, ఈ మూవీపై మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ మూవీ ఓటీటీలోకి రానుందని, ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫిక్స్‌లో జూలై 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని ఎక్స్ వేదికగా పోస్ట్ విడుదల చేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అలరించనుంది. ఇందులో మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి తదితరులు ప్రత్యేక పాత్రలో నటించారు.

విజయ్ సేతుపతి 50వ చిత్రంగా విడుదలైన ఈ మూవీ.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. విడుదలైన 25 రోజుల్లోనే రికార్డులను తిరగరాసింది. దీంతో ఆయన కెరీర్‌లోని హిట్ చిత్రాల్లో చేరింది. ఇందులో విజయ్ సేతుపతి భార్యగా దివ్యభారతి నటించింది. ఇక, ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.


Also Read: ‘మంచు’ వార్నింగ్ అందుకేనా?

కథ విషయానికొస్తే.. మహారాజ పాత్రలో విజయ్ సేతుపతి ఓ బార్బర్. ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో తన భార్య మృతి చెందగా..ఓ ఇనుప చెత్త డబ్బాతో కూతురు ప్రాణాలతో బయటపడుతుంది. దీంతో ఆ చెత్త డబ్బాకు లక్ష్మి అని పేరు పెట్టి తనతో సిటీ దూరంగా తీసుకెళ్లి ఓ ఇంట్లో నివసిస్తుంటాడు. అయితే అనుకోకుండా జరిగిన ఓ సంఘటనలో ఆ లక్ష్మి అదృశ్యమవుతుంది. తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి తన కూతురు ప్రాణాలు కాపాడిన లక్ష్మి కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తాడు. ఎలాగైనా తనకు సంబంధించిన లక్ష్మిని పట్టుకోవాలని పోలీసులను కోరుతాడు. అనంతరం పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు ఎందుకు నిరాకరించారు? లక్ష్మి దొరికిందా? లేదా? అనే విషయాలపై సినిమా కొనసాగుతోంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×