Puri Jagannadh: ఇప్పుడు కాస్త వెనకబడ్డాడు కానీ ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్ అంటే గట్టిగా వినిపించే పేరు పూరి జగన్నాథ్. బద్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా మొదట షో పడగానే కాస్త మిశ్రమ స్పందన లభించింది. కానీ ఈవెనింగ్ షో వచ్చేసరికి ఈ సినిమాకి బీభత్సమైన పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అసలు సిసలైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత చేసిన బాచి సినిమా డిజాస్టర్ సొంతం చేసుకుంది. పూరి జగన్నాథ్ విషయానికొస్తే హిట్ /ప్లాప్ సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం ఉన్న దర్శకులలో అందరికంటే స్పీడ్ గా సినిమాలు తీసే దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి మంచి పేరు ఉంది. రీసెంట్ టైమ్స్ లో పూరి జగన్నాథ్ హిట్ సినిమా చేసి చాలా రోజులైంది అని చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయాయి.
ఇకపోతే పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. అయితే పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతితో చేయబోయే సినిమాకి బెగ్గర్ అనే టైటిల్ ఖరారు చేయబోతున్నట్లు విశ్వసినీ వర్గాల సమాచారం. విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ సేతుపతి సినిమా అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. పేరుకి తమిళ నటుడు అయినా కూడా తెలుగులో కూడా చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగు ప్రేక్షకులు కూడా విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాలో రాయనం పాత్రతో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కథను సింగిల్ సిటింగ్ లో ఓకే చేశాడు అంటేనే ఈ సినిమా మీద అంచనాలు మొదలయ్యాయి.
ఇక పూరి టాలెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే, వరుసగా డిజాస్టర్ సినిమాలు ఉన్న తరుణంలో కూడా ఒక హీరోతో సక్సెస్ఫుల్ గా ఒక కథను ఒప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా కంటే ముందు పూరి కెరియర్ లో ఆరు డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి కెరియర్ లో రెండు డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. ఈ తరుణంలో విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోని కూడా ఒప్పించగలిగాడు అంటే ఏం చెప్పావ్ బాసు అంటూ సోషల్ మీడియా వేదిక చాలా మంది చర్చలు జరుపుకుంటున్నారు. ఇక ఈ సినిమాతో అయినా పూరి కం బ్యాక్ ఇస్తాడో లేదో వేచి చూడాలి. అలానే సినిమా మొదలుపెట్టే ముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాడు పూరి జగన్నాథ్. మరి ఈసారి కూడా అదే స్టైల్ ని ఫాలో అవుతాడో లేదో వేచి చూడాలి.
Also Read : Nag Ashwin: సోషల్ మీడియాలో నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్ వార్స్ పై నాగ్ అశ్విన్ రియాక్షన్