BigTV English

Nag Ashwin: సోషల్ మీడియాలో నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్ వార్స్ పై నాగ్ అశ్విన్ రియాక్షన్

Nag Ashwin: సోషల్ మీడియాలో నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్ వార్స్ పై నాగ్ అశ్విన్ రియాక్షన్

Nag Ashwin: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆ సినిమాకి ఉన్న స్టేటస్ తగ్గదు. రీసెంట్ టైమ్స్ లో రీ రిలీస్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. మహేష్ బాబు ఒక్కడు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికే కొనసాగుతుంది. కేవలం స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే కాకుండా ఎన్నో అద్భుతమైన సినిమాల రీ రిలీజులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అప్పుడు సరైన ఫలితాన్ని అందుకొని సినిమాలో కూడా ఇప్పుడు మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇ తరుణంలో నాగ్ అశ్విన్ దర్శకుడుగా పరిచయమైన, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాను మరోసారి ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు చిత్ర యూనిట్. అలానే వైజయంతి మూవీస్ నిర్మించిన ఇంద్ర సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే బ్యానర్ కు అనుసంధానంగా స్వప్న సినిమాస్ బ్యానర్ కూడా క్రియేట్ చేశారు. ఆ బ్యానర్ లో రిలీజ్ అయిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం.


నాని కెరియర్ లో ఈ సినిమా మంచి పేరు తీసుకుని వచ్చింది. ఈ సినిమాలో ముఖ్యంగా రిషి అనే పాత్ర విపరీతంగా చాలామందికి కనెక్ట్ అయింది. కనెక్ట్ అవ్వడం కంటే కూడా కళ్ళు తెరిపించింది అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఈ పాత్రను డిజైన్ చేశాడు నాగ్ అశ్విన్. ఈ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించాడు. ఇక్కడితోనే విజయ్ దేవరకొండ కి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ ఉంటే చిరంజీవి బాలకృష్ణ అంటూ మాట్లాడుకునేవారు, ఆ తర్వాత మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అంటూ చర్చలకు దిగేవారు. ఇక రీసెంట్ టైమ్స్ లో పాన్ ఇండియా హీరోల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక నాని ఫ్యాన్స్ కు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు మధ్య కూడా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. వీటి పైన నాగ్ అశ్విన్ స్పందించారు. వాళ్ళిద్దరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్నట్లు నేనెప్పుడూ గమనించలేదు. ఎవడే సుబ్రహ్మణ్యం చేసే టైంలో నాని విజయ్ ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇద్దరూ కలిసి సీన్స్ గురించి మాట్లాడుకొని యాక్ట్ చేసేవాళ్ళు. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అంటూ సమాధానం ఇచ్చాడు.

విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు అర్జున్ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరును సాధించుకున్నాడు. రీసెంట్ టైమ్స్ లో డిజాస్టర్ సినిమాలు పడినా కూడా విజయ్ కెరియర్ లో బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. విజయ్ కి ఎంత ఇమేజ్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే విజయ్ ను నానితో కంపేర్ చేసి ఫ్యాన్ వార్స్ చేయాల్సిన పని కూడా లేదు. ఇద్దరూ ఎవరి స్టైల్ లో వాళ్లు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. నాని కూడా రీసెంట్ టైమ్స్ లో ప్రేక్షకులకు మంచి క్వాలిటీ సినిమాలను అందిస్తున్నాడు. అలానే కొత్త కొత్త దర్శకులను కూడా నాని పరిచయం చేస్తున్నాడు. ఏదేమైనా ఈ రీ రిలీస్ సినిమాను ఇద్దరి అభిమానులు కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.


Also Read : Akash Puri : నాకు చిరంజీవి గారు దేవుడుతో సమానం, కానీ ఆయనతో పని చేయాలని లేదు

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×