IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )… మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… అందరూ ఎంతో ఆత్రుతగా ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి 22వ తేదీన ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ మే 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఇలాంటి నేపథ్యంలో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ షెడ్యూల్లో పూర్తిగా మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ న్యూస్… ఆ డేంజర్ ఆటగాడు వస్తున్నాడు !
దీనికి రామనవమి ( Ram Navami) కారణమని సమాచారం. ఏప్రిల్ ఆరవ తేదీన రామనవమి ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజున జరగాల్సిన మ్యాచ్ ను వాయిదా వేసుకోవాలని… పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఏప్రిల్ 6 న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens ) వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Kolkata Knight Riders vs Lucknow Super Giants ) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఆ రోజున ఆదివారం కూడా వస్తోంది. ఏప్రిల్ ఆరో తేదీన… మధ్యాహ్నం 3:30 గంటలకు లక్నో వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది.
సాయంత్రం ఏడున్నర గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Sunrisers Hyderabad vs Gujarat Titans ) మధ్య ఫైట్ ఉండనుంది. అయితే.. లక్నో వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కు సెక్యూరిటీ ఇవ్వలేమని… కోల్ కతా పోలీసులు ( Kolkata Police ) స్పష్టం చేశారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు. ఆ రోజున రామనవమి ఉన్న నేపథ్యంలో… కోల్ కత్తా నగరంలో ర్యాలీలు, ఇతర హిందూ కార్యక్రమాలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
ఈ తరుణంలోనే భద్రత మొత్తం… హిందూ కార్యక్రమాల వద్ద ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కాబట్టి ఆరో తేదీన జరిగే మ్యాచ్ ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకోవాలని… భారత క్రికెట్ నియంత్రణ మండలికి రిక్వెస్ట్ చేశారు కలకత్తా పోలీసులు. దీంతో భారత నియంత్రణ మండలి అధికారులు సందిగ్ధంలోకి వెళ్లారు. ఆరోజున మ్యాచ్ నిర్వహించాలా? మరుసటి రోజుకు వాయిదా వేయాలా? అనే దానిపై చర్చిస్తున్నారు. అయితే గతంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ… ఐపీఎల్ యాజమాన్యం తగ్గలేదు. ఇప్పుడు కూడా… అదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అయితే… కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Kolkata Knight Riders vs Lucknow Super Giants ) మధ్య జరిగే బిగ్ ఫైట్ కు కోల్ కతా పోలీసులు పర్మిషన్ ఇస్తే.. గొడవలు జరిగే ఛాన్సులు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ముందస్తుగా.. పోలీసులు అలర్ట్ అయ్యారు.
Also Read: Hardik Pandya: ప్రియురాలితో శ్రీలంక ట్రిప్.. అడ్డంగా దొరికిపోయిన టీమిండియా ప్లేయర్ ?
Kolkata Police and the local authorities informed the CAB officials that they won’t be in a position to provide adequate security for the fixture on April 6 due to Ram Navami.#IPL2025 #KKRvsLSG #CAB #BCCI #CricketTwitter pic.twitter.com/xq39jYNgKp
— InsideSport (@InsideSportIND) March 18, 2025