Vijayashanti.. లేడీ అమితాబ్ అనగానే ప్రథమంగా గుర్తుకొచ్చే పేరు విజయశాంతి (Vijayashanti).. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) లాంటి దిగ్గజ హీరోలతో పోటీపడి, యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన ఈమె.. వారితో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలిసారి కోటి రూపాయలు పారితోషకం తీసుకున్న నటీమణిగా కూడా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా విజయశాంతి సినిమాలు విడుదలవుతున్నాయి అంటే.. స్టార్ హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తమ సినిమా విడుదలను వాయిదా వేసుకునేవారు. దీన్ని బట్టి చూస్తే ఈమె సినిమాలకు ఎంత క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలా ఒకానొక సమయంలో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయింది.
కళ్యాణ్ రామ్ మూవీ తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి..
మళ్లీ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి, తన అద్భుతమైన నటనతో అబ్బురపరిచింది. ఇక వరుసగా సినిమాలలో నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె కనిపించలేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr.NTR) మనవడైన కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా నటిస్తున్న ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ అనే సినిమా ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది విజయశాంతి. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలవగా.. ఇందులో పాల్గొన్న కళ్యాణ్ రామ్, విజయశాంతి సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఇందులో తాను యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడినట్లు చెప్పిన ఆమె, సింగిల్ షాట్ లోనే ఫైట్ సీన్స్ చేసేసానని,అది చూసి సెట్ లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారని.. ఇప్పటికీ ఆ స్టామినా ఇంకా తగ్గలేదని చెప్పారు అంటూ తెలిపింది విజయశాంతి.
ఎన్టీఆర్ మనవళ్లంటే మామూలు విషయమా..?
అలాగే ఎన్టీఆర్ మనవళ్లపై కూడా కామెంట్లు చేసింది.. “కళ్యాణ్ రామ్ చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. ఈ సినిమాతో కచ్చితంగా అటు కళ్యాణ్ రామ్ తో పాటు ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఖచ్చితమైన ఒక ఫీట్ అందుకుంటారు. నేను కళ్యాణ్ రామ్ తో పలుమార్లు అడిగాను. బాబు ఎక్కడెక్కడ నుంచో మీరు కొత్త టాలెంట్లను ఎలా వెతికి తీసుకొస్తారు? అని. ఆ టాలెంట్ మీకు ఎలా కనపడుతుంది? అని నేను ప్రశ్నిస్తే.. లేదమ్మా అంటూ చాలా పొలైట్ గానే నాకు ఏదో చెప్పేశారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద స్టార్స్ అయిపోయారు. ఒక పొజిషన్ లోకి వచ్చేసారు.ఇటు కళ్యాణ్ బాబుకి సినిమా అంటే ఎంత ఫ్యాషన్ అంటే ఇక నేను మాటల్లో చెప్పలేను. ఎప్పుడూ కూడా సినిమాలో ప్రతి షాట్ గురించి మాట్లాడుతూ.. అమ్మ అది చేద్దాం.. ఇది చేద్దాం. అంటూ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎన్టీ రామారావు గారి మనవళ్లు అంటే మామూలు విషయమా” అంటూ మనవళ్లను కాస్త తాత గారితో పోలుస్తూ ఆకాశానికి ఎత్తేశారు విజయశాంతి.
ALSO READ:Samantha: చైతూ చివరి జ్ఞాపకాన్ని చెరిపేసిన సమంత.. వార్నింగ్ ఇస్తున్న ఫ్యాన్స్..!
అదే పౌరుషం.. అదే పట్టుదల..
“రామారావు గారు నేర్పించిన సిన్సియారిటీ, డెడికేషన్, మాత్రమే కాదు ఆయనలో ఉట్టిపడే అదే పౌరుషం, అదే క్రమశిక్షణ, అదే పట్టుదల నాకు మళ్ళీ వీరిలో కనిపించింది. ఈ జనరేషన్లో కూడా ఇలా ఉండడం చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫామెన్స్ అదిరిపోయింది. క్లైమాక్స్లో చింపేశారు” అంటూ కళ్యాణ్ రామ్ పై ప్రశంసలు కురిపిస్తూ విజయశాంతి కామెంట్లు చేశారు. ఇక నటనకే కేరాఫ్ అడ్రస్ అయిన విజయశాంతి.. కళ్యాణ్ రామ్ నటనను మెచ్చుకుంది అంటే ఇక ఆయన ఈ సినిమాలో ఏ రేంజ్ లో నటించారో అర్థం చేసుకోవచ్చని నందమూరి అభిమానులు కూడా ఈ కామెంట్స్ వైరల్ చేస్తూ తెగ సంతోష పడిపోతున్నారు. మొత్తానికైతే ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.