IPL 2025: మరో ఐదు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ 18 ప్రారంభం కాబోతోంది. ఈ ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు కూడా మునుపటికంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ సీజన్ లో మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్స్ కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య {IPL 2025} తొలి మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే.
Also Read: Jitesh Sharma: RCB వరుసగా 5 ట్రోఫీలు గెలవడం పక్కా..!
ఈ ఐపీఎల్ లోని మ్యాచ్ లని జియో హాట్ స్టార్ లో డిజిటల్ గా ప్రసారం చేయనున్నారు. గతంలో ఐపీఎల్ మ్యాచ్ లని జియో సినిమాలో ఉచితంగా ప్రసారం చేయగా.. ఇటీవల రిలయన్స్ జియో.. డిస్నీ హాట్ స్టార్ విలీనం కావడంతో సబ్స్క్రిప్షన్ ని తప్పనిసరి చేశారు. దీంతో ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ లు చూడాలనుకునే వారికి తీవ్ర నిరాశ ఎదురయింది. ఈ నేపథ్యంలో జియో {Reliance Jio} వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
కొన్ని ప్రత్యేక ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వరకు ఉచిత జియో హాట్ స్టార్ సుబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ పరిమితకాల ఆఫర్ మార్చ్ 17 నుండి మార్చి 31 మధ్య అందుబాటులో ఉంటుంది. కేవలం రూ. 299 తో రీఛార్జ్ తో ఈ ప్లాన్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ తో క్రికెట్ అభిమానులు టీవీ, మొబైల్ లో ఫోర్ కే లో 90 రోజులపాటు ఉచిత జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ ని ఆస్వాదించవచ్చు.
అంతేకాకుండా 800 కు పైగా టీవీ ఛానల్ లు, 11కు పైగా ఓటీటీ యాప్ లు, అపరిమిత వైఫై, ఫోర్కే స్ట్రీమింగ్ అనుభవాన్ని అందించే జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ 50 రోజుల ఉచిత ట్రయల్ ని అనుభవించవచ్చు. ప్రస్తుత జియో వినియోగదారులు 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ తో రీఛార్జి చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ ని ఆక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ మార్చ్ 17 నుండి 31 వరకే అందుబాటులో ఉంటుంది. జియో హాట్ స్టార్ సుబ్స్క్రిప్షన్ మార్చి 22 ఐపీఎల్ ప్రారంభం రోజున ఆక్టివేట్ అవుతుంది. ఇక 90 రోజుల పాటు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
Also Read: Yuvraj Singh: విండీస్ ప్లేయర్ యూవీ దాడి.. 2007 ఫైట్ రిపీట్ !
మరోవైపు జియో {Reliance Jio} ఇప్పటికే ఐపీఎల్ 18వ సీజన్ కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం 100 రూపాయల ప్లాన్ తో 90 రోజుల జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్, 5 జిబి డేటా లభిస్తుంది. అయితే ఇది డేటా ప్లాన్ మాత్రమే. కాల్స్ లేదా ఎస్ఎంఎస్ లు ఉండవు. అలాగే 949 ప్లాన్ తో కూడా ఇదే ఆఫర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మరిన్ని ప్లాన్లకు ఈ ఆఫర్ ను విస్తరించింది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. ఈ ఐపీఎల్ 18వ సీజన్ ని ఆస్వాదించవచ్చు.