Samantha.. సమంత(Samantha).. తొలిసారి పలు యాడ్స్ లో కనిపించి, అందరినీ ఆకట్టుకున్న సమంత.. తమిళ్ సినిమాల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో తమిళ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈమె క్రమంగా టాలీవుడ్ దర్శక నిర్మాతలను కూడా ఆకర్షించింది. అలా తొలిసారి ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలు దోచుకున్న ఈమె, ఇదే సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) తో ప్రేమలో పడింది. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు దగ్గుబాటి రానా(Daggubati Rana) సహాయంతో పెద్దలను ఒప్పించి మరీ..రెండు సాంప్రదాయ పద్ధతులలో వివాహం చేసుకున్నారు.
వరుస వెబ్ సిరీస్ లతో బిజీగా మారిన సమంత..
వివాహం తర్వాత ఎంతో సంతోషంగా కొనసాగిన ఈ జంట.. అనుకోకుండా పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక ఎవరి కారణాలు వాళ్ళవి. కానీ అసలు కారణం మాత్రం ఇప్పటివరకు బయటపడలేదు. విడాకులు తీసుకొని ఎవరికి వారు మళ్లీ తమ కెరియర్ పై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే సమంత చివరిగా “సిటాడెల్ – హనీ బన్నీ” వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ తో పాటు తన సొంత బ్యానర్ అయిన ‘ట్రాలాలా మూవీస్ పిక్చర్స్’ బ్యానర్ పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో కూడా లీడ్ రోల్ పోషిస్తోంది. ఇందులో ప్రముఖ హీరో ప్రియదర్శి (Priyadarshi ) కూడా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఇదే ప్రొడక్షన్ హౌస్ నుండి తొలి ప్రాజెక్టుగా ‘శుభం’ అనే సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టింది.
ALSO READ:Nayanthara: స్టూడియో స్టైల్ లో నయనతార కొత్త ఇల్లు.. ధర తెలిస్తే గుండె గుభేల్..!
చైతూ చివరి జ్ఞాపకాన్ని చెరిసివేసిన సమంత..
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే సమంత.. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసుకోగా.. అందులో నాగచైతన్యకు సంబంధించిన చివరికి జ్ఞాపకాలను కూడా చెరిపివేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సమంత, నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు వీరిద్దరూ తమ చేతిపై సేమ్ టు సేమ్ టాటూ వేయించుకున్నారు. అయితే ఇప్పుడు సమంత ఆ టాటూని తొలగించిందని, సమంత షేర్ చేసిన ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మొత్తానికైతే సమంత చైతూ చివరి జ్ఞాపకం గా ఉన్న టాటూలు కూడా తొలగించడంతో ఇక బంధాలు పూర్తిగా దూరమైపోయాయి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సమంత ఆ టాటూ ని చెరిపి వేసినా ఇంకా అది కనిపిస్తూనే ఉంది. ఇది చూసిన కొంతమంది నెటిజెన్స్ “దయచేసి మళ్లీ ప్రేమలో పడితే ఇలా టాటూలు వేయించుకోకండి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.
నాగ చైతన్య కెరియర్..
నాగచైతన్య విషయానికి వస్తే.. సమంతతో విడాకులైన తర్వాత శోభిత ధూళిపాల (Shobhita dhulipala)ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం రెండవ భార్యతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించిన నాగచైతన్య.. ఆమెతో కలిసి పలు వెకేషన్స్ కి వెళ్తూ ఆ మూమెంట్స్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు.