BigTV English

Thangalaan: సెన్సార్ పూర్తిచేసుకున్న తంగలాన్..

Thangalaan: సెన్సార్ పూర్తిచేసుకున్న తంగలాన్..

Thangalaan: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. గతేడాది వచ్చిన పొన్నియన్ సెల్వన్ కూడా తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత విక్రమ్ తంగలాన్ పై దృష్టి పెట్టాడు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు కూడా. ప్రస్తుతం విక్రమ్ ఆశలన్నీ తంగలాన్ మీదనే పెట్టుకున్నాడు.


పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీల‌మ్ ప్రొడక్ష‌న్స్, జియో స్టూడియోస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మాళ‌విక మోహ‌న‌న్, పార్వ‌తి తిరువోతు, ప‌శుప‌తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను పెంచేశాయి.

తంగలాన్ కోసం తమిళ్ తంబీలు మాత్రమే కాదు తెలుగువారు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటున్న తంగలాన్.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్నీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలిపారు. హిస్టారిక‌ల్ ఫాంటెసీ మూవీగా రాబోతున్న ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ టాక్ నే అందించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×