BigTV English

Emaindho Manase Song out: మళ్లీ అందమైన అమ్మాయి మనసు దోచేసిన ‘యావరేజ్ స్టూడెంట్ నాని’..

Emaindho Manase Song out: మళ్లీ అందమైన అమ్మాయి మనసు దోచేసిన ‘యావరేజ్ స్టూడెంట్ నాని’..

Melody song from Average student Nani Movie: ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గతంలో విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఎక్స్‌లెంట్ పెర్ఫాన్స్‌తో హీరో పవన్ కుమార్ ఎంతగానో ఆకట్టుకున్నారు. తాజాగా సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘ఏమైందో మనసే’ అంటూ ఆ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ముఖ్యంగా యువతకు తెగ నచ్చుతుంది. కాలేజీ లైబ్రరీలో చదువుతున్న సమయంలో హీరోయిన్‌ను చూసి హీరో కలలు కంటూ ప్రేమ మైకంలో విహరిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదరకరమైన వాతావరణంలో ఇద్దరు కలిసి నడిచి వెళ్తున్న సీన్ కూడా సూపర్బ్‌గా అనిపిస్తోంది. హిట్ పక్కా అంటూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Also Read: రంజితమే సాంగ్ కు స్టెప్స్ అదరగొట్టిన రష్మిక

ఈ మెలోడీ పాటకు కృష్ణవేణి మల్లవజ్జల సాహిత్యం అందించారు. కార్తీక్ బి కొడకండ్ల మంచి మ్యూజిక్‌తో అలరించగా, శక్తి శ్రీ గోపాలన్ ఈ పాటను ఆలపించారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కాబోతున్నది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్నది. వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, సాహిబా భాసిన్‌తో పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించారు. సజీష్ రాజేంద్రన్ ఈ సినిమాకు డీవోపీగా పని చేయగా, ఉద్ధవ్ ఎస్‌బీ ఎడిటర్‌గా పని చేశారు. రాజ్ పైడి మాస్టర్ పాటలకు కొరియోగ్రఫీగా పనిచేశారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×