E-Paper
Advertisement

Virupaksha:- ‘విరూపాక్ష’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. సత్తా చాటిన సాయిధ‌ర‌మ్ తేజ్‌

Virupaksha:- ‘విరూపాక్ష’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. సత్తా చాటిన సాయిధ‌ర‌మ్ తేజ్‌

Virupaksha collections:- సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘విరూపాక్ష’. బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై బివిఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 21న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్‌లోనే సెకండ్ హ‌య్య‌స్ట్ వ‌సూళ్లను సాధించింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏరియాల వారీగా ‘విరూపాక్ష’ మూవీ సాధించిన క‌లెక్ష‌న్స్ వివ‌రాలు..

నైజాం – రూ. 1.82 కోట్లు, సీడెడ్ – రూ.54 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర – రూ.58 ల‌క్ష‌లు, ఈస్ట్ – రూ.40 ల‌క్ష‌లు, వెస్ట్ – రూ.47 ల‌క్ష‌లు, గుంటూరు – రూ. 46 ల‌క్ష‌లు, కృష్ణా – రూ.32 ల‌క్ష‌లు, నెల్లూరు – రూ. 20 ల‌క్ష‌లు వ‌చ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘విరూపాక్ష’ సినిమాకు రూ.4.79 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. గ్రాస్ ప్ర‌కారం చూస్తే రూ.8.60 కోట్లు అని స‌మాచారం. ఇక క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియాలో రూ. 36 ల‌క్ష‌లు, ఓవ‌ర్ సీస్‌లో రూ.1.20 కోట్లు వ‌చ్చాయి. అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 6.35 కోట్లు వ‌చ్చాయి (గ్రాస్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా చూస్తే రూ.11.85 కోట్లు) అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

‘విరూపాక్ష’ సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.22 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. రూ.23 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌స్తే సినిమా హిట్ అయిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇక మొత్తంగా చూస్తే రూ.16.65 కోట్లు వ‌సూళ్లు రావాలి. సినిమాకు పాజిటివ్ బ‌జ్ రావ‌టంతో శ‌ని, ఆదివారం సినిమా క‌లెక్ష‌న్స్ మ‌రింత‌గా పెరుగుతాయ‌ని సినీ స‌ర్కిల్స్ అంచ‌నా వేస్తున్నాయి.

విరూపాక్ష సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్. సునీల్, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×