BigTV English

Vishal: హీరో విశాల్ కు ఏమైంది… గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు..

Vishal: హీరో విశాల్ కు ఏమైంది… గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు..

Vishal: కొలీవుడ్ స్టార్ హీరో విశాల్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సూపరిచితమే.. ఈయన తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. అలాగే తమిళ్ ఇండస్ట్రీలో ఆయన చేసిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. మాస్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇస్తుంటారు. ఇక తమిళ ఇండస్ట్రీలో విశాల్ మాటే శాసనం. ఆయన చెప్పినట్లే ప్రస్తుతం అక్కడ ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. ప్రస్తుతం ఈయన సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన సినిమాల కన్నా రాజకీయాలే బెస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటిలో పెద్ద దుమారం రేపాడు. ఆ తర్వాత 2026 లో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పాడు. ఇక ఇప్పుడు ఆయనకు షూటింగ్ లో గాయాలు అయ్యాయని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. అసలు విశాల్ కు ఏమైంది అనే చర్చ నడుస్తుంది. హీరో విశాల్ కు ఏమైందో తెలుసుకుందాం..


తమిళ స్టార్ హీరో విశాల్ తెలుగు వాడే.. కానీ తమిళ ఇండస్ట్రీలో సినిమాలతో బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. పొలిటికల్, సినీ స్టాండ్స్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు.. వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో నిర్మాతలు ఆయనను తెగ అభిమానిస్తుంటారు. అందుకే ఆయనతో సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హీరో విశాల్ ఓ కార్యక్రమంలో కనిపించారు. అందులో ఆయన గుర్తు పట్టలేని విధంగా కనిపించారు. ఆయన్నీ అలా చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలేమయిందని ఆరా తీస్తున్నారు. నిజంగానే విశాల్ కు ఏమైందో ఒకసారి చూద్దాం..

హీరో విశాల్ తాజాగా లేటెస్ట్ ఫిల్మ్ మదగజరాజ సినిమా ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు. అలాగే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన వేదికపై మాట్లాడుతుంటే చేతులు వణుకుతున్నాయి. చాలా నిదానంగా మాట్లాడుతున్నారు. సరిగ్గా నడవలేకపోయారు. చాలామంది ఆయనను పరామర్శించడం కూడా కనిపించింది. అయితే విశాల్ హై ఫీవర్, జలుబుతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే ఈ మూవీ ఇప్పటిలోది కాదు. మదగజరాజ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని 13 ఏళ్లు అయ్యింది. కానీ ఇన్నాళ్లకు ఈ మూవీని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. అప్పటిలో పోస్టర్స్ తో భారీ బజ్ ను క్రియేట్ చేసిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..


ఇకపోతే ఈయన రాజకీయాల పై ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం తెలిసిందే.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అన్ని పనులు పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనిపిస్తోందని… త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని, ప్రజాసేవ చేస్తానని విశాల్ తెలిపారు. విషయం ఏదైనా సరే తాను నిజయతీగా మాట్లాడతానని, తన మాదిరి అందరూ ఉండలేరని చెప్పారు. ఇక తనకు చాలా సింపుల్ గా ఉండటమే ఇష్టమని హీరో విశాల్ చెప్పారు. ఆడంబరంగా బతకడం తనకు ఇష్టం ఉండదని అన్నారు. ఇతరులను కాపీ కొట్టడం కూడా తనకు నచ్చదని తెలిపారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×