BigTV English

OTT Movie: మనిషిని పోలిన మనిషిని తయారు చేసే పోలీసులు… ఇక్కడ మర్డర్లు ఎన్నైనా చేసుకోవచ్చు…

OTT Movie: మనిషిని పోలిన మనిషిని తయారు చేసే పోలీసులు… ఇక్కడ మర్డర్లు ఎన్నైనా చేసుకోవచ్చు…

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలు, ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మూవీ లవర్స్ ని బగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. వీటిలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో వెకేషన్ కి వెళ్లిన ఒక జంటకు ఆ ప్రాంతంలో, విచిత్రమైన సంఘటనలను ఎదుర్కొంటుంది. పోలీసులు మర్డర్ కేసులనుంచి తప్పించడానికి, డూప్లి కేట్ మనుషులను తయ్యారు చేస్తారు. సస్పెన్స్ తో ఎంటర్టైన్ చేసే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? పేరు ఏమిటి? ఈ వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ‘ఇన్ఫినిటీ పూల్‘ (Infinity pool).  2023లో వచ్చిన ఈ మూవీకి బ్రాండన్ క్రోనెన్‌బర్గ్ దర్శకత్వం వాహయిచ్చారు. ఇందులో అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్, మియా గోత్, క్లియోపాత్రా కోల్‌మన్ నటించారు. ఈ మూవీ షూటింగ్ ప్రధానంగా క్రొయేషియాలోని షిబెనిక్‌లో జరిగింది. ఈ మూవీ జనవరి 27, 2023న కెనడాలో ఎలివేషన్ పిక్చర్స్ ద్వారా థియేటర్‌లలో విడుదలైంది. ఈ మూవీకి విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో, హీరోయిన్ జాలిగా గడపడానికి ఒక వెకేషన్ కి వెళ్తారు. ఆ ప్రాంతంలో డబ్బున్న వాళ్లకు మాత్రమే ఒక పెద్ద హోటల్ ఉంటుంది. మిగతా అంతా పేదరికంలో ఉంటారు. ఆ హోటల్ కి వచ్చిన హీరో, హీరోయిన్ జాలిగా గడుపుతారు. బయటికి ఒంటరిగా వెళ్తే ఆ ప్రాంతంలో చాలా సమస్యలు వస్తాయని, ముందే హెచ్చరిస్తారు హోటల్ యాజమాన్యం. ఈ క్రమంలో ఆ హోటల్లో హీరోయిన్ కి ఫుడ్ నచ్చకపోవడంతో బయటికి వెళ్లి తినాలనుకుంటారు. ఇద్దరూ హోటల్ బయట బీచ్ కి దగ్గర్లో ఉన్న, ఒక చిన్న హోటల్ కి వెళ్తారు. అక్కడ వీళ్లకు గాబి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. వీళ్లంతా కలిసి డిన్నర్ కి ప్లాన్ చేస్తారు. డిన్నర్ ముగించుకొని మళ్ళీ హోటల్ కి వెళ్తుండగా, హీరో ఒక యాక్సిడెంట్ చేస్తాడు. ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోతాడు. హీరో, హీరోయిన్ భయపడి హోటల్ కి వచ్చేస్తారు. మరుసటి రోజు పోలీసులు ఈ జంట దగ్గరికి వస్తారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు డిమాండ్ చేస్తారు.

డబ్బులు ఇస్తానని చెప్పడంతో పోలీసులు, హీరోని పోలిన మనిషిని తయారు చేసి, అతనికి బదులు డూప్లి కేట్ వ్యక్తిని చంపుతారు. అలా అక్కడ డబ్బు ఉన్నవాళ్లు నేరాలు చేసి, తప్పించుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతుండగా హీరోయిన్ భయపడి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోదామని హీరోతో చెప్తుంది. అయితే హీరోకి గాబి అనే అమ్మాయి మత్తు ఇచ్చి, ఆ ప్రాంతంలో అలవాటు పడే విధంగా చేస్తుంది. నేను వచ్చేది లేదని హీరో, హీరోయిన్ తో చెప్తాడు. హీరోయిన్ బాధపడుకుంటూ అక్కడ నుంచి తన ఊరు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోకి అక్కడున్న ఒక గ్యాంగ్ పరిచయం అవుతుంది. వాళ్ళతో చేరి హీరో చేయకూడని పనులు చేస్తాడు. చివరికి హీరో ఆ ప్రాంతం నుంచి బయట పడతాడా? మనిషిని పోలిన మనుషులను పోలీసులు ఎలా తయారు చేస్తున్నారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×