OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ లవర్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ వైపు చూస్తున్నారు. నచ్చిన సినిమాలను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చే సస్పెన్స్ సినిమాలను, మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తారు. ఎందుకంటే వీటిలో చివరి వరకు సస్పెన్స్ ని కొనసాగిస్తారు మేకర్స్. హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సస్పెన్స్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘బ్లూ మై మైండ్‘ (Blue my mind). ఈ మూవీలో టీనేజ్ కి వచ్చిన ఒక అమ్మాయికి, సముద్రమే ఎప్పుడూ గుర్తుకు వస్తుంది. ఆమె శరీరంలో కూడా వింత మార్పులు జరుగుతూ ఉంటాయి. చివరికి ఈ అమ్మాయి జలకన్య అని తలుస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మియా అనే అమ్మాయి చదువుకోవడానికి కాలేజీకి వెళ్తుంది. కాలేజీకి కొత్తగా రావడంతో ఎవరినైనా ఫ్రెండ్స్ చేసుకోవాలనుకుంటుంది. అయితే అందరూ ఆమెను దూరం పెడుతూ ఉంటారు. ఆ తర్వాత కాలేజ్లో ఉండే ముగ్గురు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. వాళ్లు అన్ని విషయాలలో చాలా ఫాస్ట్ గా ఉంటారు. మియాకి బాయ్ ఫ్రెండ్ కావాలంటే చెప్పమని అడుగుతారు. అలా ఆమె కు ఎలాంటివాడు కావాలో తెలుసుకొని డేటింగ్ సైట్ లో పెడతారు. కొద్ది రోజులకు ఆ సైట్లో మియాకి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతనితో మియా ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. అయితే మియా శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కళ్ళు మూసుకున్నా సముద్రమే మనసులో కనబడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చాక అక్వేరియంలో ఉండే చేపలను పట్టుకుని తినేస్తుంది. మాంసం మీద ఎక్కువ మనసు పెడుతుంది. తనకి కాళ్లు కూడా మరొక రూపం వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక హాస్పిటల్ కి వెళుతుంది. డాక్టర్లు ఈమెకు పరీక్ష చేసి ఆశ్చర్యపోతారు.
విషయం తెలుసుకునే లోగానే మియా అక్కడ్నుంచి భయపడి పారిపోతుంది. ఆ తర్వాత మియాకి ఇప్పుడు ఉన్నవాళ్ళు సొంత తల్లిదండ్రులు కాదని తెలుస్తుంది. సముద్రతీరంలో మియా వీళ్ళకు దొరుకుతుంది. ఈ విషయం తెలుసుకున్న మియా, తను ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకుంటుంది. ఇంటిలో ఒకరోజు పూర్తి జలకన్యగా మారిపోతుంది. చివరికి జలకన్యగా మారిన మియా ఏమవుతుంది? తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటుందా? జలకన్య రూపంలో ఉన్న ఆమెను చూసినవాళ్లు ఏం చేస్తారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బ్లూ మై మైండ్’ (Blue my mind) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.