Vishnu Priya: అందాల హాట్ భామ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోవే పోరా అనే షోతో యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ చిన్నది.. తన ముక్కు వలన ట్రోల్ అయ్యి మరింతఫేమస్ అయ్యింది. అలా ఒక పక్క షో.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్న విష్ణుప్రియకు బిగ్ బాస్ సీజన్ 8 లో ఛాన్స్ వచ్చింది. ఇక సీజన్ 8 లో విష్ణు కనిపించగానే.. ఇంకేముంది అసలు ఆట మార్చేస్తుంది. బిగ్ బాస్ కు లేడీ విన్నర్ గా మారుతుంది అనుకున్నారు. ఇక్కడ ఆమె అభిమానులు అనుకున్నది ఒకటి.. అక్కడ ఆ చిన్నది చేసింది ఇంకొకటి.
గేమ్స్ కన్నా, బిగ్ బాస్ టైటిల్ కన్నా.. హౌస్ లో పృథ్వీరాజ్ శెట్టితో రొమాన్స్ నే ఎక్కువ కోరుకుంది. సాధారణంగా మూడు నెలలు కలిసి ఉండాలి కాబట్టి ఒక ఫ్రెండ్ ను వెతుక్కోవాలి అనుకోలేదు. మనస్ఫూర్తిగా పృథ్వీని ఆమె ప్రేమించింది. అతడి కోసం ఎన్నో త్యాగాలు చేసింది. అసలు కొన్నిసార్లు అయితే ఎందుకు విష్ణును ఇంకా హౌస్ లో ఉంచుతున్నారో అర్ధమే కాలేదు. కళామతల్లి ముద్దుబిడ్డ అంటూ ప్రేక్షకులకు చిరాకు పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఏదో విధంగా విష్ణు టాప్ 10 వరకు కొనసాగింది. ఇక చివర్లో పృథ్వీని వదలలేక వదలలేక బయటకు వచ్చింది. బయటకు వచ్చాకా కూడా ఆ కన్నడ కుర్రాడిని విష్ణువదలలేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ నుంచి వచ్చాక విష్ణుప్రియ సోషల్ మీడియాలో చాలా తక్కువ కనిపించింది. హౌస్ లో నుంచి బయటకు వచ్చాకా.. అమ్మడు తన చెల్లితో కలిసి వెకేషన్ కు వెళ్ళింది. బాలిలో ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను విష్ణు అభిమానులతో పంచుకుంది.
Paradha: అదిరిపోయిన పరదా టీజర్.. అనుపమ లుక్ హైలైట్ అంతే
బీచ్ ఒడ్డున.. చిట్టిపొట్టి బట్టలతో ఇద్దరు ముద్దుగుమ్మలు అందాలను ఆరబోశారు. ముఖ్యంగా విష్ణుప్రియ బ్రాతో కనిపించి కిర్రాక్ పుట్టించింది. బీచ్ ఒడ్డున బ్రా పై ష్రగ్ తో క్లివేజ్ షో చేస్తూ.. టాప్ యాంగిల్ లో ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కించింది. ఇక బ్రాతో అమ్మడు అందాల ఆరబోయాడం కొత్తేమి కాదు. గతంలో కేవలం బ్రా మీదనే ఫోటోషూట్ కూడా చేసింది. అప్పట్లో ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేసాయి. ఇప్పుడు మరోసారి విష్ణు ఇలా అందాల ఆరబోత చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ ఫోటోలపై నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు.
బిగ్ బాస్ లో అంత అమాయకంగా మాట్లాడిన విష్ణునే ఇలా చూపిస్తుంది అని ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఆమె అవకాశాల కోసమే చేస్తుందని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. అవకాశాల కోసం ఇంతగా దిగజారాలా విష్ణు ప్రియా.. మరీ దారుణంగా బ్రాతో.. ఛీఛీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి ట్రోల్స్ వస్తాయని తెలిసే ఆమె కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేసింది. అయినా ట్రోలర్స్ ఆగుతారా.. ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ విష్ణును ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇంత అందాలను ఆరబోసిన విష్ణుకు ఎలాంటి అవకాశాలు దక్కుతాయో చూడాలి.