Paradha: అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కార్తికేయ 2 సినిమా ముందు వరకు ఈ చిన్నదానికి అంతగా విజయాలు దక్కిన దాఖలాలు లేవు. తెలుగు, తమిళ్ సినిమాల్లో చేస్తున్నా కూడా అమ్మడికి హిట్స్ పడలేదు. ఇక కార్తికేయ 2 సినిమాతో ఈ చిన్నది ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్ హోదా వచ్చేసింది. ఆ తరువాత అనుపమ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఇక ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకు నో చెప్పే హీరోయిన్స్ లో అనుపమ కూడా ఒకరు. కానీ, అమ్మడు హిట్స్ కోసం ఆ గ్లామర్ ను కూడా ఎరవేసింది. టిల్లు స్క్వేర్ లో అనుపమ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. టిల్లు స్క్వేర్ ఈ చిన్నదానికి భారీ విజయాన్ని అందించి ఇంకా తిరుగులేకుండా చేసింది. ప్రస్తుతం అనుపమ చేతిలో మూడు సినిమాలకు పైగానే ఉన్నాయి. అందులో ఒకటి పరదా.
RGV: సిండికేట్.. ఈ ఒక్క సినిమాతో నా పాపాలన్నీ కడిగేసుకుంటాను..
లేడీ ఓరియెంటెడ్ సినిమాగా పరదా తెరకెక్కుతుంది. సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృదయం ఫేమ్ దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముగ్గురు మహిళల చుట్టూ ఈ కథ సాగుతుంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
ముగ్గురు మహిళల ట్రావెలింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టీజర్ ను బట్టి తెలుస్తోంది. ప్రేమ, పెళ్లిల మధ్య నలిగిపోయిన ఈ ముగ్గురు.. తమ సొంత ప్రయాణాన్ని ఎలా ప్రారంభించారు అనేది కథగా తెలుస్తోంది. అనుపమ లుక్ మాత్రం హైలైట్ గా మారింది. ఒక బంజారా మహిళగా ఆమె కనిపిస్తుంది. ఆడవారికి ఇంట్లో ఉండే కట్టుబాట్లు. దానివలన వారు ఎంత క్షోభ అనుభవిస్తున్నారు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది.