BigTV English

CM Revanth Govt: సీఎం టూర్ సక్సెస్.. కీలక సంస్థలతో రేవంత్ సర్కార్ ఒప్పందం.. వేలల్లో ఉద్యోగాలు..

CM Revanth Govt: సీఎం టూర్ సక్సెస్.. కీలక సంస్థలతో రేవంత్ సర్కార్ ఒప్పందం.. వేలల్లో ఉద్యోగాలు..

CM Revanth Govt: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పలు దేశాలు, సదస్సులో పర్యటిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే సీఎం రేవంత్ రెడ్డి దావోస్, లండన్, దుబాయ్‌లో పర్యటించారు. అయితే గతేడాది కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడులు తేవాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రముఖ సంస్థల సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఓసారి ప్రభుత్తం ఏర్పడిన మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం కుదుర్చుకున్న ముఖ్య ఒప్పందాలను చూద్దాం.


ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి యువత భవిష్యత్తే లక్ష్యంగా విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. 2024 జనవరిలో దావోస్ పర్యటనలో రూ.12,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో రూ.8వేల కోట్ల బ్యాటరీ ఉత్పత్తి సంస్థ స్థాపించి 6వేల మంది యువతకు ఉద్యోగం కల్పిస్తామని గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేర్కొంది. ఫార్మా కంపెనీ అయిన ఆరాజెన్ రూ.2,000 కోట్లతో మల్లాపూర్‌లో పరిశ్రమను విస్తరింప జేయాలని ఎంవోయూ కుదర్చుకున్నారు.

స్కైరూట్ ఏరోస్పేస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో రాకెట్ తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్కైరూట్ ఏరోస్పేస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా రేవంత్ సర్కార్ హైదరాబాద్‌లో ఫోర్త సిటీ, ఏఐ సిటీ, డేటా సెంటర్లపై దృష్టి పెట్టింది.


తాజాగా.. మూడు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌లో కూడా పర్యటించారు. సీఎం వివిద సంస్థల సీఈవోలతో సమావేశమయ్యారు. రాష్రంలో ఒక్క హైదరాబాద్ మహా నగరమే కాకుండా.. ఇతర జిల్లాల్లో కూడా పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. సింగపూర్‌లో మూడు రోజులు పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మూడు కీలక ఒప్పందాలు కుదర్చుకున్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం ప్రారంభించిన స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీలో గుడ్ స్కిల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐటీఈతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సింగపూర్‌లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో రూ.3500 కోట్లతో ఏఐ సెంటర్‌ను నెలకొల్పేలా చర్చలు జరిపింది. అలాగే హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్యాండ్ సంస్థతో రూ.450 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

Also Read: Jobs in NTPC: బీటెక్ అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ ఉద్యోగం వస్తే నెలకు రూ.1,00,000

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో పర్యటిస్తున్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హెసీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో విజయ్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఆయనతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌లో దాదాపు 3.20 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు చర్చలు జరిపారు. దీని ద్వారా 5వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాంపస్‌లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్‌కు సంబంధించిన విషయాలను వివరిస్తుంది. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలతో పాటు హైదరాబాద్‌లోని టెక్నాలజీ, ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2007 నుంచే హెచ్ సీఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలను అందిస్తోంది.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×