E-Paper
Advertisement

Vishwak Sen and Naga Vamsi Clarifies Balakrishna Incident: బాలయ్య బాబు మందు తాగలేదు.. అవన్నీ గ్రాఫిక్స్ చేశారు: నాగవంశీ

Vishwak Sen and Naga Vamsi Clarifies Balakrishna Incident: బాలయ్య బాబు మందు తాగలేదు.. అవన్నీ గ్రాఫిక్స్ చేశారు: నాగవంశీ
Advertisement

Vishwak Sen and Naga Vamsi Clarifies Balakrishna Incident: విశ్వక్ సేన్ నటిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ రేపు అంటే మే 31న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రీసెంట్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో బాలయ్య తన స్పీచ్‌తో అదరగొట్టేశాడు. కానీ అదే సమయంలో బాలయ్య బాబు చేసే ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటి అంజలిని స్టేజ్‌పై పక్కకి నెట్టేశాడు. అందుకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు బాలయ్యపై రకరకాలు విమర్శలు చేస్తున్నారు. మహిళలపై ఇదేనా మీరు చూపించే ప్రేమ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అదొక కారణం అయితే మరొకటి ఈ ఈవెంట్‌కి బాలయ్య మందుకొట్టి వచ్చాడు అంటూ నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.

Advertisement

అయితే వీటన్నింటికి క్లారిటీ ఇచ్చేందుకు మూవీ టీమ్ తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. అందులో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ముందుగా బాలయ్య.. నటి అంజలిని పక్కకు నెట్టడం పై మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ ఒక దగ్గర కలిసి ఉండేటప్పుడు కాస్త పక్కకు జరుగు అని అంటా.

Also Read: మందేసి నటి అంజలిని స్టేజ్‌ పై తోసేసిన బాలయ్య బాబు.. ఇదిగో వీడియో

Advertisement

అయితే అప్పటికీ వినకపోతే ఫ్రెండ్స్ కాబట్టి.. ఆ చనువుతో కాస్త పక్కకు జరుగు అంటూ కాస్త వెనక్కి నెడతాం. అదే అక్కడ జరిగింది. దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాన్నిపై మీరెందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి ఆ తర్వాత వారిద్దరు హైఫైవ్ కొట్టుకున్నారు. దాన్ని ఎందుకు ఆ వీడియోలో వెయ్యలేదు. ఆ క్లిప్ ముందు వెనుక ఉన్న సందర్భాన్ని చూసుకుంటే ఏది తప్పుగా కనిపించదు.’’ అని అన్నారు.

 

అలాగే బాలయ్య కాళ్ల దగ్గర ఉన్న బాటిల్‌లో మందు ఉన్నట్లు కనిపించిన వీడియోపై కూడా నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ‘‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ చేసింది నేనే. అక్కడ బాలయ్య బాబు కాళ్ల దగ్గర ఎలాంటి బాటిళ్లు లేవు. అవన్నీ సీజీల్లో (కంప్యూటర్ గ్రాఫిక్స్) పెట్టారు. అసలు ఆ కింద ఏమి పెట్టలేదు.’’ అంటూ నాగవంశీ ఆ వీడియోలపై క్లారిటీ ఇచ్చాడు. దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఓ రేంజ్‌లో హాట్ టాపిక్‌ అయిందనే చెప్పుకోవాలి. ఒకరకంగా ఇది ప్రమోషన్స్‌లా కూడా వారికి ఉపయోగపడిందనే చెప్పుకోవాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×