BigTV English

Balayya Strange Behavior: మందేసి నటి అంజలిని స్టేజ్‌ పై తోసేసిన బాలయ్య బాబు.. ఇదిగో వీడియో

Balayya Strange Behavior: మందేసి నటి అంజలిని స్టేజ్‌ పై తోసేసిన బాలయ్య బాబు.. ఇదిగో వీడియో

Gangs Of Godavari Pre Release Event: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న కొత్త సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తాజాగా నిర్వహించారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్‌కి డ్యాషింగ్ అండ్ డైనమిక్ హీరో బాలయ్య బాబు ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇక బాలయ్య బాబు స్టేజ్‌పై ఉంటే మామూలుగా ఉండదు. నవ్వులే నవ్వులు.. తన మాస్ డైలాగ్‌లతో హోరిత్తిస్తాడు. అయితే ఈ సారి బాలయ్య బాబు చేసిన ఓ పని నెట్టింట దుమారం రేపుతోంది.


ఈ ఈవెంట్‌లో బాలయ్య బాబు, నేహాశెట్టి, అంజలి పక్క పక్కనే ఉన్నారు. అయితే అదే సమయంలో అంజలిని కాస్త పక్కకు జరగమని బాలకృష్ణ చెప్తాడు. ఆమె కొంచెం జరుగుతుంది. అయితే ఇంకోసారి అలా నోటితో చెప్పకుండా చేతికి పనిచెప్పాడు బాలయ్య బాబు. ఈ సారి ఇంకొంచెం పక్కకు జరుగు అని అంజలికి చెప్పకుండా.. తోసేసాడు. దీంతో అంజలి ఒక్క సారిగా పడిపోయేంత పని అయింది. అయితే ఆ సందర్భంలో నేహాశెట్టి షాకైంది. కానీ అంజలి మాత్రం నవ్వేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

అయితే ఒక్కడ మరొక విషయం ఏంటంటే.. ఈ ఈవెంట్‌లో బాలయ్య బాబు మందు సేవించాడని కొందరు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే బాలకృష్ణ కూర్చున్న ప్లేస్ దగ్గర ఒక బాటిలో వాటర్‌తో ఉండగా.. మరొక బాటిల్‌లో మద్యపానం ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మహిళలపై బాలకృష్ణ ప్రవర్తన ఇదేనా అంటూ మండిపడుతున్నారు.


Also Read: మా మోక్షు వస్తున్నాడు.. మీ ముగ్గురే వాడికి ఇన్స్పిరేషన్: బాలయ్య బాబు స్పీచ్ వేరే లెవెల్

ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అతడి లాస్ట్ మూవీ ‘గామి’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా మంచి హిట్ సాధిస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈ నెల మే 31న రిలీజ్ కానున్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

https://twitter.com/SumaTiyyaguraa/status/1795687455880093716

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×