Vishwak Sen Laila:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లైలా (Laila) . భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదలైంది. రామ్ నారాయణ్ (Ram Narayan) దర్శకత్వంలో.. యంగ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి (Sahoo garapati) నిర్మించిన చిత్రం ఇది. తొలిసారి మాస్ హీరో ఇందులో లేడీ గెటప్ లో నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఆకాంక్ష శర్మ(Aakansha Sharma ) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీనికి తోడు సెన్సార్ సభ్యులు కూడా A సర్టిఫికెట్ జారీ చేశారు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా పూర్తి డిజాస్టర్ గా నిలిచింది. వైసీపీ అభిమానుల దెబ్బకు బోల్తా కొట్టిందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ట్రెండింగ్ లో #DisasterLaila..
దీనికి తోడు డిజాస్టర్ లైలా అంటూ పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. లైలా సినిమాకి వైసీపీ అభిమానులు గట్టి షాక్ ఇచ్చారు. సినిమా విడుదల కాకముందే నిన్న రాత్రి నుంచి#DisasterLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇకపోతే వైసీపీ అభిమానులు ఈ సినిమా డిజాస్టర్ అని చెప్పకపోయినా సినిమా కంటెంట్ మాత్రం చెత్తగా ఉందని, ఈ సినిమా డిజాస్టర్ అనడంలో ఎటువంటి తప్పు లేదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య వచ్చిన విశ్వక్ సేన్ లైలా మూవీ వైసీపీ ఫ్యాన్స్ దెబ్బకు బోల్తా పడిందని చెప్పవచ్చు.
పృథ్వీ కామెంట్స్..వైసీపీ ఫ్యాన్స్ ఆగ్రహం..
అసలు విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి 9వ తేదీన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా విచ్చేశారు. అయితే అదే సమయంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ (Prudhvi Raj) వైసీపీ పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇండైరెక్టుగా కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా షాట్ మధ్యలో ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే 150 అన్నారు. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ చివరికి 11 గొర్రెలే మిగిలాయి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లను కైవసం చేసుకుని ఘనవిజయం సాధించి ,చరిత్ర సృష్టించింది. కానీ 2024 ఎన్నికలలో కేవలం 11 సీట్లు దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక దీనిని ఇండైరెక్టుగా దృష్టిలో పెట్టుకొని సినిమా ఈవెంట్లో రాజకీయం మాట్లాడుతూ అటు వైసిపి ఇటు అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యారు పృధ్వీరాజ్. దీంతో #BoycottLaila అంటూ దాదాపు 30 వేలకు పైగా ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విశ్వక్ సేన్ , నిర్మాత సాహూ గారపాటి క్షమాపణలు కోరుతూ సినిమాను చంపొద్దని వేడుకున్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ వెంటనే విశ్వక్ సేన్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఒక పోస్ట్ పెట్టడంతో#DisasterLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. .. పృథ్వీరాజు కూడా అందరికీ క్షమాపణలు తెలియజేశారు. ఇక ఎవరు ఏం చెప్పినా అభిమానులు మాత్రం సినిమాని ఘోర డిజాస్టర్ చేసేసారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.