Abhay Naveen : బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది బాగా పాపులర్ కొందరు సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. మరికొంతమంది మాత్రం ఏకంగా సినిమాలనే తెరకెక్కిస్తున్నారు. కొందరు హౌస్ లోకి ఒక లక్ష్యంతో అడుగుపెట్టి వాటిని సాధించుకున్నామని చెప్తున్నారు.. ఈ మధ్య బిగ్ బాస్ సెలెబ్రేటిలు నిత్యం ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నటుడు అభయ్ నవీన్ కూడా తన కలను నెరవేర్చుకొనే పనిలో ఉన్నాడు. ఇంతకీ అతను కోరిక ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 8 లో సందడి చేశాడు నటుడు అభయ్ నవీన్.. తన ఆట తీరుతో కొందరిని బాధ పెట్టాడు. ఇక హౌస్ లో తన గేమ్ నచ్చక జనాలు అతనికి ఓట్లు వెయ్యకుండా బయటకు పంపేశారు. అలా కొన్ని వారాలకే అభయ్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత పలు మీడియా ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. తాజాగా అభయ్ డైరెక్టర్ గా ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బయట పెట్టాడు. బిగ్ బాస్ లోకి వెళ్లడం వల్ల తన కల నెర వేరిందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు..
Also Read : పవన్ కళ్యాణ్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. పరువు తీసేశాడుగా..
ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ తర్వాత కెరీర్ హ్యాపీగా సాగుతోంది. ప్రస్తుతం యాక్టర్‌గా మూడు సినిమాలు చేస్తోన్నా. డైరెక్టర్‌గా నేను చేస్తోన్న లవ్ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇంతకుముందు డైరెక్టర్‌గా రామన్న యూత్ సినిమా చేశా.. ఆ టైం లో యాక్టింగ్ పూర్తిగా మానేశాను అని వార్తలు వినిపించాయి. దాంతో ఒక్క సినిమా అవకాశం కూడా నా వద్దకు రాలేదు అని అన్నాడు. బిగ్ బాస్ వరం.. దాంతో మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తున్న అని అభయ్ అన్నారు. యాక్టర్‌గా నేను ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతోనే రామన్నయూత్ మూవీతో డైరెక్టర్‌గా మారా.డైరెక్టర్‌గా ఫస్ట్ సినిమా అంటే లవ్ స్టోరీతోనే ఎందుకు చేయాలి? పాటలు, కామెడీ లేకుండా సినిమా చేయలేమా? అనే ఆలోచనతో వైవిధ్యంగా ప్రయత్నం చేశాం.. కానీ రిజల్ట్ యావరేజ్ గానే ఉంది. పెద్ద ల సలహాలు తీసుకోలేదు అలా జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం ఆ తప్పులు చెయ్యను. మళ్లీ సినిమా తీస్తానని అభయ్ అంటున్నాడు.
బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ హీరోగా నా డైరెక్షన్‌లో ఓ సినిమాకు ప్లాన్ జరుగుతోంది. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు నిఖిల్, నేను ఈ సినిమా గురించి మాట్లాడుకున్నాం. బిగ్‌బాస్ పూర్తయిన తర్వాత నిఖిల్‌కు కథ చెప్పా. అతడికి నచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. బిగ్‌బాస్ తో నిఖిల్, సోనియా, ప్రేరణ రూపంలో మంచి ఫ్రెండ్స్ దొరికారు.. త్వరలోనే ఈ మూవీ గురించి ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అభయ్ కు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జర చూసుకో బ్రో రిస్క్ అవసరమా చెప్పు అని కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై అభయ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక ప్రస్తుతం అభయ్ నవీన్ లైఫ్ ఆఫ్ విష్ణు అండ్ ఈషా అనే మూవీ చేస్తున్నాడు. స్వీయ దర్శకత్వంలో సినిమా రాబోతుంది. దాదాపు షూటింగ్ పూర్తి అయ్యింది. త్వరలోనే మూవీ థియేటర్లలోకి రాబోతుందని సమాచారం. ఈ మూవీ అన్నా హిట్ అవుతుందేమో చూడాలి..