E-Paper
Advertisement

Vishwak Sens Gangs ff Godavari OTT: అఫీషియల్.. రెండు వారాల్లోనే ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. డేట్ ఇదే..!

Vishwak Sens Gangs ff Godavari OTT: అఫీషియల్.. రెండు వారాల్లోనే ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. డేట్ ఇదే..!
Advertisement

Vishwak Sens Gangs of Godavari OTT: టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ పలు డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తీసి మంచి హిట్‌లు అందుకుంటున్నాడు. స్టోరీకి తగ్గ పాత్రలో నటించి అందరిచేత ప్రశంసలు పొందుతున్నాడు. 2017లో ‘వెళ్లిపోమాకే’ సినిమా ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన విశ్వక్.. ఆ తర్వాత 2019లో ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో దర్శకుడిగా కూడా అరంగేట్రం చేశాడు. ఇక ఈ మూవీ హిట్ తర్వాత విశ్వక్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

వరుస సినిమాలతో సూపర్ హిట్లు అందుకొని బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబట్టాడు. ఇక ఇటీవలే మార్చిలో ‘గామి’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ మూవీలో విశ్వక్‌ను ఎన్నడూ చూడని పాత్రలో చూసి అభిమానులు ఆశ్యర్యపోయారు. అంతేకాకుండా విశ్వక్ యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. సినిమా ఏదైనా.. అందులో పాత్ర ఎలాంటిదైనా హిట్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు విశ్వక్. అందుకే డిఫరెంట్ స్టోరీలతో వచ్చి మంచి హిట్లు కొడుతున్నాడు.

Advertisement

అయితే గామి తర్వాత రీసెంట్‌గా మరొక మూవీతో వచ్చాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ చేశాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార అండ్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌లపై తెరకెక్కింది. ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఈ చిత్రానిన్ని గ్రాండ్ లెవెల్లో నిర్మించాడు. మే 31న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో విశ్వక్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకాభిమానులు ఫిదా అయిపోయారు.

Also Read: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్విట్టర్ రివ్యూ.. లంకల రత్నం అదరగొట్టేశాడంటగా..!

Advertisement

అలా బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అదేంటి రిలీజ్ అయి రెండు వారాలు కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తుందా? అని అనుకుంటున్నారా?. అవును మీరు విన్నది నిజమే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 14 నుంచి తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం వంటి భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తాజాగా తన ట్విట్టర్ (ఎక్స్) పోస్ట్ చేసింది. దీంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×