Gangs Of Godavari Twitter Review: గత రెండు నెలలుగా సరైన సినిమాలు లేక థియేటర్ల కళ తప్పాయి. ఈ రెండు నెలల్లో అన్నీ చిన్న చిన్న సినిమాలే సందడి చేశాయి. అయినా అవి పెద్దగా రెస్పాన్స్ అందుకోలేదు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ హడావుడి ఉండటంతో పెద్ద సినిమాలు రిలీజ్‌కు నోచుకోలేదు. అయితే ఇక ఎలక్షన్స్ ముగియడంతో.. ఇప్పుడు పెద్ద సినిమాల జోరు కొనసాగేందుకు సిద్ధమైంది. ఇవాళ అంటే మే 31న ఏకంగా మూడు బడా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ఒకటి.
ఈ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసుకుంది. అయితే ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య బాబు చేసే రచ్చతో సినిమాపై అందరి ఫోకస్ పడింది. దీంతో ఈ సినిమాకి క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
సినీ ప్రియులు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసి వారి అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని అన్నారు. విశ్వక్ సేన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడని కామెంట్లు చేస్తున్నారు. సినిమా కథ కొత్తగా లేకపోయినా.. టేకింగ్ బాగుందని అంటున్నారు. సినిమాలో ఎక్కడా చిన్న ల్యాగ్ కూడా లేదని చెబుతున్నారు.
Good first half. Although not a brand new story it has a racy screenplay without any lag, that will definitely work in the films favor. Not a boring moment so far.
Second half will be key.
— T 🌸 (@PinkCancerian) May 31, 2024
Also Read: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి ఊపుతెప్పిస్తున్న మోత సాంగ్.. జోడీ భలే ఉంది!
అలాగే మాస్ డైలాగ్స్ అదిరిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది విశ్వక్ సేన్ మాస్ ఫీస్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదని.. చాలా బాగుందని అంటున్నారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదని.. అయితే డైరెక్షన్ కాస్త ఔట్‌డేటెడ్‌గా ఉందని అంటున్నారు. కానీ విశ్వక్ సేన్ లంకల రత్నం పాత్రలో దుమ్ము దులిపేసాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.
#GangsofGodavari good first half 👍… Vishwak sen just killed it🔥
— Gautam (@gauthamvarma04) May 31, 2024
Jr tho teeyalsina movie.. inka bagundedi
Viswak’s mass feast #GangsofGodavari 1st half 3.25/5
— AN (@anurag_i_am) May 30, 2024
అలాగే నేహా శెట్టి అందాలు కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్‌గా చెప్పుకొస్తున్నారు. అలాగే నటి అంజలి కూడా రత్నమాల పాత్రకు బాగా సరిపోయిందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం విశ్వక్ సేన్ నుంచి అనుకున్నంత మాస్ మసాలా యాక్షన్ కనిపించలేదని చెప్పుకొస్తున్నారు. అలాగే సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్‌గా అయిపోయిందని ఎక్కడా అర్థం చేసుకునే గ్యాప్ కూడా లేదని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎక్కుంగా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో విశ్వక్ ఖాతాలో మరొక హిట్ పడిందని అనుకోవచ్చు.
Showtime #GangsOfGodavari
— Bangaru Neckleesu (@Kamal_Tweetz) May 30, 2024