BigTV English

2 Flights in on Same Runway: ఒకే రన్ వేపై రెండు విమానాలు.. ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం..!

2 Flights in on Same Runway: ఒకే రన్ వేపై రెండు విమానాలు.. ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం..!

IndiGo Flights Landing and Air India Flight Takeoff on Same Runway in Mumbai Airport: ఒకే రన్ వే రెండు విమానాలు.. అదెలా సాధ్యమంటారా? ఒకటి ల్యాండ్ కావడం, మరొకటి టేకాఫ్.. ఇదేదో ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ? ఈ వ్యవహారం జరిగింది ఎక్కడోకాదు. ముంబై ఎయిర్‌పోర్టులో. నమ్మడానికి విచిత్రంగా ఉంది.


శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ముంబై ఎయిర్‌పోర్టులో ఈ తతంగం జరిగింది. ఒకే రన్ వేపై ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతోంది. ఏమాత్రం ల్యాండ్ అయ్యే విమానం కాస్త స్పీడ్‌గా వచ్చినా, టేకాఫ్ అయ్యే విమానం కాస్త లేటుగా అయినా అక్కడ జరిగే నష్టాన్ని అస్సలు ఊహించలేము.

అదెలా జరిగింది? దీని వెనుక ఏం జరిగింది? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఈ వ్యవహారం పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-డీజీసీఏ విచారణ మొదలుపెట్టేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్‌ని తొలగించినట్టు వార్తలు తెలుస్తోంది. ఇండోర్ నుంచి ముంబైకి ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన 6E 6053 నెంబర్ విమానం వస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ల్యాండింగ్‌ అయ్యింది. ఇదే విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా తెలిపింది.


Also Read: ఎన్డీఏ ఏకపక్ష నిర్ణయాలు ఇకనుంచి చెల్లవు: సోనియా గాంధీ

అదే సమయంలో ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఎయిరిండియా విమానం అదే రన్ వే పై నుంచి టేకాఫ్ అవుతోంది. టేకాఫ్ ఏమాత్రం డిలే అయినా జరిగే నష్టాన్ని అస్సలు ఊహించలేమని అంటున్నారు. ఈ వ్యవహారంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ కారణం ఎవరిది? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌దా? ఏమైనా టెక్నికల్ సమస్య ఏర్పడిందా? ఇలాంటి ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

Tags

Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×