BigTV English

Cracked Heels: పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇవి వాడితే మీ సమస్య మాయం..

Cracked Heels: పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇవి వాడితే మీ సమస్య మాయం..

Cracked Heels: చాలా మంది కాళ్ల పగుళ్ల(మడమల పగుళ్లు)తో బాధపడుతుంటారు. పాదాలకు ఏ చిన్న గాయం అయినా అది శరీరం అంతటా నొప్పిని కలిగిస్తుంది. అయితే అందులోను వాతావరణం పొడిబారితే చాలా మంది కాళ్ల పగుళ్లతో బాధపడుతుంటారు. అందులోను మహిళలను ఈ సమస్య ఎక్కువగా వెంటాడుతుంది. విటమిన్ లోపం, థైరాయిడ్, ఊబకాయం, తేమ లేకపోవడం వంటి సమస్యల కారణంగా చాలా మందికి మడమల పగుళ్లు ఏర్పడుతుంటాయి. కొంత మంది తరచూ ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. అయితే కొంతమందికి ఇది ఆరోగ్యపరంగా, మరి కొంత మందికి జన్యు పరంగా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే పగుళ్ల సమస్యకు నివారణలు చాలా ఉంటాయి. అందులో పలు మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


చాలా మంది అమ్మాయిలకు చర్మాన్ని అందంగా, మృదువుగా ఉంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ తరుణంలో చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడితే చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం వారానికి ఒకసారైనా పెడిక్యూర్ చేయించుకుంటారు. లేదంటే గోరు వెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల పాదాలలోని మృతకణాలు తొలగిపోయి శుభ్రంగా ఉంటాయి. ముఖ్యంగా పగుళ్లు రాకుండా ఉండేందుకు ప్రతీ రోజూ రాత్రి పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని బాదం నూనెను అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.

ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. ఈ సీజన్ లో పాదాల పగుళ్లు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కాళ్లు, పాదాలకు క్రీమ్ అప్లై చేసుకోవాలి. పాదాలు తడిగా ఉండేలా చూసుకోవాలి. ఇది పాదాలపై తేమను నిలుపుతుంది. దీని కోసం మార్కెట్లో ఫుట్ మసాజ్ క్రీములు దొరుకుతాయి. వీటిని తరచూ రాసుకోవడం వల్ల పాదాలు మృదువుగా పొడిబారకుండా ఉంటాయి. అయితే పాదాలకు ఈ క్రీములు మాత్రమే కాకుండా కొబ్బరి నూనెను రాసిన మంచి ప్రయోజనాలు ఉంటాయి. తేనె కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. తేనెలో ఉండే యాంటీ మైక్రోబియల్, బాక్టీరియల్ లక్షణాలు పగిలిన మడమలను శుభ్రంగా ఉంచేలా చేస్తాయి.


అంతేకాదు వంటగదిలో దొరికే చెక్కెర, నిమ్మకాయతో కూడా పగుళ్లను నివారించుకోవచ్చు. నిమ్మకాయపై కొంచెం చెక్కెర వేసి పగుళ్లు ఉన్న చోట మసాజ్ చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గి మెత్తగా మారుతాయి.

Tags

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×