BigTV English

Viswaksen : విశ్వక్ సేన్ బ్రేకప్ స్టోరీ.. ఆ వయసులో అలా జరిగింది…

Viswaksen : విశ్వక్ సేన్ బ్రేకప్ స్టోరీ.. ఆ వయసులో అలా జరిగింది…

Viswaksen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి తెలియని వాళ్ళు ఉండరు.. మొదటి నుంచి విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అందుకున్నాడు. ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టిన కొద్ది రోజులలోనే స్టార్ హీరో అయ్యాడు. ప్రస్తుతం ఏడాదికి రెండు, మూడు సినిమాలతో పలకరిస్తున్నాడు. గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ప్రస్తుతం లైలా సినిమాతో థియేటర్లలో కి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 14 న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నాడు. తాజాగా తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పి అందరికి షాక్ అయ్యేలా చేశాడు. ఇక ఆలస్యం ఎందుకు హీరో బ్రేకప్ స్టోరీ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


లైలా కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో హీరో తన బ్రేకప్ స్టోరీ గురించి బయట పెట్టాడు. ఆ ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. టీనేజ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిని చూడగానే ఇష్టం పుడుతుంది. ఆ సమయంలో దానిని మనం సీరియస్‌ రిలేషన్‌ అనుకుంటాం. ఆస్టోరీ గురించి ఎప్పుడూ తలుచుకున్నా నవ్వొస్తుంది. అలాంటిదే నా జీవితంలోనూ ఒక కథ ఉంది. అది కాకుండా సీరియస్‌ లవ్‌ స్టోరీ కూడా ఒకటి ఉంది. నాకు 24 ఏళ్ల వయసు లో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. మూడున్నరేళ్లకు బ్రేకప్‌ అయింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డా. ఆ బాధ నుంచి బయటకు వచ్చి నా లైఫ్‌పై ఫోకస్‌ పెట్టా. ఆ తర్వాత నాకు ఎవరి మీద ఇష్టం కలగలేదని చెప్పాడు. ఆ తర్వాత ప్రేమ మీద పూర్తిగా ఆసక్తి పోయిందని చెప్పాడు. ప్రస్తుతం అలాంటి ఆలోచనలు రావు. ఇంట్లో వాళ్ళకే ఆ ఛాన్స్ అని విశ్వక్ అన్నాడు. మరి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైతే ఇంకా టైం ఉందని అన్నాడు. మొత్తానికి విశ్వక్ సేన్ కూడా బ్రేకప్ స్టోరీ ఉందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

ఇక విశ్వక్ సేన్ నటించిన లైలా విషయానికొస్తే.. గతంలో ఎప్పుడు మాస్ హీరోగానే కనిపించి అలరించి ఆకట్టుకున్న ఈ హీరో మొదటి లేడి గెటప్ లో కనిపిస్తున్నాడు. రామ్‌ నారాయణ్‌ తెరకెక్కించిన చిత్రమే ఇది. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. లైలాగా ఎందుకు అవతారమెత్తాడు? అతడికి ఎదురైన సమస్యలు ఏమిటి? అనే ఆసక్తికర అంశాల తో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా రూపొందినట్లు సమాచారం. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలి దుమారం రేపుతున్నాయి. ఇక రేపే సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×