BigTV English

Laila: కళ్లతోనే కవ్విస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం

Laila: కళ్లతోనే కవ్విస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం

Laila movie latest update(Telugu film news): ఒకప్పుడు స్టార్ హీరోలు ఇలాంటి సినిమాలు మాత్రమే చేయాలి అనే రూల్ ఉండేది. దానికి కారణం అభిమానులు. మా హీరో ఇలాంటి పాత్రలు చేస్తే ఉరుకోము అంటూ గొడవ చేసేవారు. కానీ, ఇప్పుడు అలా లేదు. జనరేషన్స్ మారుతున్నాయి. ఇప్పుడు హీరోలను చూసి సినిమాలకు వెళ్లడం మానేసి కథ నచ్చితే సినిమాలకు వెళ్తున్నారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా కథ నచ్చకపోతే టక్కున చెప్పేస్తున్నారు. కథకు తగ్గ పాత్ర ఏదైనా సరే అభిమానులు అంగీకరిస్తున్నారు.


ఇక దీంతో హీరోలు సైతం ప్రయోగాలు మొదలుపెడుతున్నారు. ఇలా ప్రయోగాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ ఏడాది గామి లాంటి ప్రయోగాత్మకమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విశ్వక్.. ఈ మధ్యనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ఇక దీంతో ఈసారి మంచి కథలతో ప్రేక్షకులను మెప్పించాలని మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు.

మొట్టమొదటిసారి విశ్వక్.. అమ్మాయి గెటప్ లో నటిస్తున్న చిత్రం లైలా. రామ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విశ్వక్.. అమ్మాయిగా, అబ్బాయిగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.


ఇక తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీంతో పాటు లైలా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో అమ్మాయిగా మారిన విశ్వక్ కళ్ళను మాత్రమే చూపించారు. సడెన్ గా ఆ కళ్ళను చూస్తే ఎవరు విశ్వక్ కళ్ళు అని అనుకోరు.. ఎవరో అందమైన అమ్మాయి కళ్ళే అని అనుకుంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అంతలా ఆ కళ్ళు కవ్విస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది వాలెంటెన్స్ డే కు లైలా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×