BigTV English

Vishwambhara Teaser : మెగా మాస్ బియాండ్ యూనివర్స్… విజువల్ ట్రీట్ గా “విశ్వంభర” టీజర్

Vishwambhara Teaser : మెగా మాస్ బియాండ్ యూనివర్స్… విజువల్ ట్రీట్ గా “విశ్వంభర” టీజర్

Vishwambhara Teaser : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘విశ్వంభర’ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. దసరా ట్రీట్ గా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.


స్టన్నింగ్ విజువల్స్ తో ‘విశ్వంభర’  టీజర్

‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘విశ్వంభర’. ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటిస్తున్నారు. వీరితోపాటు ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈశా చావ్లా, సురభి, ఆశ్రిత వేముగంటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ షూట్, మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉన్నట్టుగా తెలుస్తోంది. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ హై బడ్జెట్ ఫాంటసీ డ్రామాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మొత్తం విజువల్ వండర్ గా సాగింది. అందులో ఎగిరే గుర్రంపై మెగాస్టార్ ఇచ్చిన మాస్ ఎంట్రీ, పవర్ ఫుల్ డైలాగ్ లు, గ్రాండ్ విజువల్స్ తో పక్కా దసరా ట్రీట్ అనిపించేలా ఉంది టీజర్. వేరే ప్రపంచంలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే డైలాగ్స్ మాత్రం ఒకటికి రెండు సార్లు వినాల్సి రావడం కాస్త డిసప్పాయింట్మెంట్ ను ఇచ్చింది. మొత్తానికి మెగా అభిమానులకు మాత్రం ఈ దసరాకు ఇదొక మాస్ ట్రీట్ అని చెప్పొచ్చు.


‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా ?

ఇక మూవీని అనౌన్స్ చేసినప్పుడే సంక్రాంతి రిలీజ్ డేట్ పై కర్చీఫ్ వేశాడు ‘విశ్వంభర’. కానీ తాజాగా తన వారసుడు చెర్రీ కోసం ఆ డేట్ ని త్యాగం చేశాడు మెగాస్టార్. 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ మూవీని రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. కానీ తాజాగా అదే డేట్ రోజు ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ కాబోతోంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. స్వయంగా దిల్ రాజు మూవీని సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ వార్త చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కి నిరాశను కలిగించే విషయం అని చెప్పాలి. అయితే ఆ డిసప్పాయింట్మెంట్ ను తగ్గించడానికి ఇచ్చిన మాట ప్రకారం ‘విశ్వంభర’ టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు చిరు. ఈ టీజర్ లో ‘విశ్వంభర’ మూవీ రిలీజ్ డేట్ గురించి మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం నడుస్తున్న ట్రేడ్ బజ్ ప్రకారం ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×