BigTV English
Advertisement

Vishwambhara : దొరికిపోయిన ‘విశ్వంభర’… టీజర్లోనే ఇన్ని డమ్మీలైతే సినిమా పరిస్థితి ఏంటో?

Vishwambhara : దొరికిపోయిన ‘విశ్వంభర’… టీజర్లోనే ఇన్ని డమ్మీలైతే సినిమా పరిస్థితి ఏంటో?

Vishwambhara : ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటింగ్ భారీ బడ్జెట్ సినిమాలలో ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా ఒకటి. దసరా కానుకగా ఈ సినిమా నుంచి మెగా అభిమానుల కోసం మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విజువల్స్ బాగున్నాయి అని కొంతమంది ప్రశంసలు కురిపించినప్పటికీ, చాలామంది ఏదో యాడ్ చూసినట్టుగా ఉంది అంటూ ట్రోల్ చేశారు. అంతేకాకుండా ఫుటేజ్ ని ఎక్కడి నుంచో కాపీ కొట్టారు అంటూ కొన్ని సినిమాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లని సోషల్ మీడియాలో నెటిజెన్లు షేర్ చేయడంతో ఈ సినిమా టీజర్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది.


అయితే తాజాగా మరోసారి ‘విశ్వంభర’ (Vishwambhara) టీజర్ లోని కొన్ని సన్నివేశాల ఎడిటింగ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో సినిమాల విషయంలో విఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలకు కోట్లకు కోట్లు తగలేస్తున్నప్పటికీ కొంతమంది మేకర్స్ ఇలా ఎడిటింగ్ విషయంలో మాత్రం రాజీ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే ‘ఆది పురుష్’ మూవీ విషయంలో ఇలాగే దారుణమైన ట్రోలింగ్ జరగగా, తాజాగా ‘విశ్వంభర’  వంతు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నప్పటికీ ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో మేకర్స్ అజాగ్రత్తగా ఉండడం మెగా అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో టీజర్ లో ఉండే యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన ఎపిసోడ్ ను, అందులో ఒకే వ్యక్తిని డమ్మీలాగా మార్చి, యాంగిల్స్ మార్చి మూడు నాలుగు చోట్ల పడిపోయినట్లుగా చూపించడంపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ‘విశ్వంభర’ (Vishwambhara) మేకర్స్ దొరికిపోయారు.. ఇలా ఇంకా ఎంతకాలం అంటూ డీటెయిల్డ్ గా ఆ వీడియోలో మేకర్స్ చేసిన తప్పిదాల గురించి విమర్శిస్తున్నారు. ఇక ఇంకోపక్క ఈ టీజర్ మొత్తం కల్కి, అవతార్, మార్వెల్ స్టూడియోస్ హాలీవుడ్ సినిమాలకు కాపీ అనే విమర్శలు టీజర్ రిలీజ్ అయిన రోజే కనిపెట్టేశారు నెటిజన్లు. దీంతో టీజర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక సినిమాలో ఇంకెన్ని డమ్మీలు ఉంటాయోనని అంటున్నారు. మరి ఈ విమర్శలకు మేకర్స్ సినిమాతోనైనా ఫుల్ స్టాప్ పెడతారా లేదంటే మరింత నెగెటివిటీని ఎదుర్కొంటారా అనేది చూడాలి.


‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటిస్తున్నారు. వీరితోపాటు ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈశా చావ్లా, సురభి, ఆశ్రిత వేముగంటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ షూట్, మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉన్నట్టుగా తెలుస్తోంది. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×