Viswak Sen : టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేస్తున్న సినిమాల కన్నా వివాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.. గతంలో కల్కి టైం లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారం రేపాయో తెలియంది కాదు. ఇప్పుడు మరోసారి నోరు జారి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం వార్తల్లో ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మొదటి నుంచి విశ్వక్ తన సినిమాల ప్రమోషన్స్ ను కాస్త డిఫరెంట్ గా చేస్తాడు. కొన్ని సార్లు రివర్స్ అయ్యి అవి తన మేడకే చుట్టుకుంటాయి. తాజాగా అలాంటి వివాదంలోని ఇరుక్కున్నాడు. తాజాగా ఈయన మాట్లాడిన స్పీచ్ చర్చనీయాంశంగా మారింది.
ఈ మాస్ హీరో ప్రస్తుతం ‘మెకానిక్ రాఖీ’ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎప్పటిలా చెలరేగిపోయాడు విశ్వక్‌సేన్. ముందుగా ట్రోలర్స్ పై పడ్డాడు. తానేదో సినిమా ప్రమోషన్లలో కాస్త జోష్ మీద మాట్లాడితే, అదే ముక్కను అటు తిప్పి ఇటు తిప్పి వేస్తారు. ‘మీరు నన్నేం పీకలేరం’టూ… కాస్త బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడు. రివ్యూవర్లకు ‘వీపులు పగులుతాయ్’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు సినిమా గురించి ఏమి రాసుకున్నా పర్వాలేదు. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే తాట తీస్తాను అని హెచ్చరించాడు.
అంతేకాదు రివ్యూవర్ల పై తనకు గౌరవం ఉందని, చిన్నచూపు లేదని, వాళ్లకు నచ్చేలా సినిమాలు తీస్తానని, కానీ రాసేటప్పుడు రివ్యూవర్లు కూడా బాధ్యతగా ఉండాలంటూ గుర్తు చేసాడు . ఇక మీదట ఎప్పుడూ రివ్యూవర్ల గురించి మాట్లాడడని ఈ వేదికపై నుంచి మాట ఇచ్చేశాడు.. ఇక ప్రతీ సినిమాకూ ఛాలెంజ్ చేయడం విశ్వక్‌సేన్ కు అలవాటు. ఈ సినిమా కోసం కూడా అలాంటి ఛాలెంజ్ ఏదో చేస్తాడనుకొన్నారంతా. కానీ ఈసారి రివర్స్ గేర్‌లోకి వెళ్లాడు.. సినిమా సరిగ్గా ఆడకుంటే అది ఇది చేస్తానని చెప్పను.. ఈ సినిమా తాను దగ్గరుండి చూసుకొన్నాడట. బాగా వచ్చిందన్న నమ్మకం ఉందన్నాడు. మొత్తాని కి తన స్పీచ్ తో మరోసారి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్నాడు. సినిమా విడుదలకు ముందు విశ్వక్ ఎప్పుడూ ఎలాంటి బజ్ కోరుకొంటాడో, అలాంటి బజ్ తన స్పీచ్ తో తీసుకొచ్చాడు. సినిమా సంగతి ఏమో గాని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విశ్వక్ స్పీచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి..
ఇక ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. గతంలో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సరికొత్త కాన్సెఫ్ట్ తో రాబోతున్న ఈ మూవీ ఏ మాత్రం సక్సెస్ ను అందిస్తుందో చూడాలి..