E-Paper
Advertisement

Mumbai News: దంపతుల మధ్య బిర్యానీ చిచ్చు.. ఉప్పు ఎక్కువైందని కోపంతో.. భార్యని అత్యంత దారుణంగా

Mumbai News: దంపతుల మధ్య బిర్యానీ చిచ్చు.. ఉప్పు ఎక్కువైందని కోపంతో.. భార్యని అత్యంత దారుణంగా
Advertisement

Mumbai News: ఉప్పు ఎక్కువ తీసుకోవద్దని పదే పదే చెబుతారు. దానివల్ల లేనిపోని సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్న సందర్భాలు లేకపోలేదు. దీనికి ఫ్యామిలీ సమస్యలు తోడైతే ఆ ఇంటి గురించి అస్సలు ఊహించుకోలేము. తాజాగా ఓ దంపతుల మధ్య బిర్యానీ చిచ్చుపెట్టింది. బిర్యానీలో ఉప్పు ఎక్కవ కావడంతో భర్తకు కోపం తన్నుకుంటూ వచ్చింది. ఆ కోపంలో రాక్షసుడిగా మారాడు. భార్యని చంపేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది.

Advertisement

ముంబైలో దారుణం.. దంపతుల మధ్య బిర్యానీ చిచ్చు

Advertisement

యూపీకి చెందిన ఓ జంట ముంబై సిటీలో ఉంటోంది. మంజర్ ఇమామ్ హుస్సేన్ సివిల్ ఇంజనీర్.  అతడి భార్య నజియా పర్వీన్. వీరి సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాకు చెందినవారు.  నజియా పర్వీన్ తన కుటుంబంలో పెద్దది. ఆమె తండ్రి సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు. తల్లి నాజియా, తమ్ముళ్లు, చెల్లిళ్లతో నివాసం ఉంటోంది.

నజియా తన అత్త కొడుకు మంజర్ ఇమామ్ హుస్సేన్. సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. మంజర్-నజియా రెండేళ్లుపాటు ప్రేమించుకున్నారు.  ఆ సమయం ముంబైలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఇరువురు తల్లిదండ్రులు వారికి వివాహం చేశారు.  అక్టోబర్ 20, 2023న పెళ్లి జరిగింది. వివాహం తర్వాత మంజర్-నజియా ముంబైకి వచ్చారు.

కోపంతో భార్యని చంపిన భర్త, ఆపై అరెస్ట్

గోవండిలోని శివాజీనగర్ ప్రాంతంలో ఓ ఇంటికి అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నారు. పెళ్లి జరిగి రెండేళ్ల తర్వాత ఈ దంపతుల మధ్య చిన్ని చిన్న గొడవలు జరిగేవి. ఈ విషయం తెలిసినా ఇరు కుటుంబాలు పెద్దగా పట్టించుకోలేదు. కొత్త దంపతుల మధ్య ఫోన్స్ కాల్స్, ఆహారం విషయంలో చిన్న చిన్న సమస్యలు సహజమని భావించారు.

పెళ్లి తర్వాత మంజార్ ప్రవర్తనలో మార్పురావడం గమనించింది భార్య. తరచుగా నాజియాని కొట్టేవాడు. ఒకసారి భార్య పన్ను కూడా విరిగిపోయింది. డిసెంబర్ 19న రాత్రి బిర్యానీ చేసింది నజియా. అందులో కాస్త ఉప్పు ఎక్కువైంది. దీంతో భార్యభర్తల మధ్య మళ్లీ గొడవలు జరిగింది. ఇద్దరి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది.

ALSO READ:  ట్రాక్ తప్పిన టీచరమ్మ.. ప్రియుడి మోజులోపడి భర్తని లేపేసింది

మంజర్ కోపంతో భార్య తలను గోడకు గుద్దేశాడు. తలకు బలమైన గాయం కావడం, అధిక రక్తస్రావం కారణంగా అక్కడికక్కడే మరణించింది. ఘటన గురించి సమాచారం స్థానికులు పోలీసులకు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మంజర్ ఇమామ్ హుస్సేన్‌ని అరెస్టు చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×