V.K.Naresh:ప్రముఖ సీనియర్ నటుడు వీ.కే.నరేష్ (VK.Naresh) తాజాగా వయసుతో సంబంధం లేకుండా చేసిన వీడియో ఒకటి నెట్టింట దుమారం రేపుతోంది. ముఖ్యంగా కూతురు వయసున్న అమ్మాయితో ఆ రొమాన్స్ ఏంటి? ఈ వయసులో ఇది అవసరమా..? మీకేం పోయేకాలం.. అంటూ నెటిజన్స్ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand), నటసింహ నందమూరి బాలకృష్ణ (Natasimha Nandamuri Balakrishna) హిట్ మూవీ టైటిల్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ (Samyuktha Menon), సాక్షి వైద్య (Sakshi Vaidya)హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్స్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తూ ఉండగా.. ఇప్పటికే ఈ నారీ నారీ నడుమ మురారి సినిమా నుండి పోస్టర్లు విడుదలయ్యాయి.
సిరి హనుమంత్ తో నరేష్ రొమాంటిక్ స్టెప్పులు..
ఇక ఇటీవల విడుదలైన “దర్శనమే” అనే మెలోడీ సాంగ్ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది..ఇప్పుడు ఈ పాటకు టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ (Naresh), బుల్లితెర నటి సిరి హనుమంత్ (Siri Hanumanth) తో కలిసి డాన్స్ చేశారు. “దర్శనమే మధుర క్షణమే.. ప్రతి నిమిషం పరవశమే” అనే పాటకు వీరిద్దరూ రొమాంటిక్గా స్టెప్పులు వేశారు. ఇందులో సిరి పట్టుచీర కట్టుకొని.. నరేష్ పట్టు పంచెలో కనిపించారు. చివర్లో వీరిద్దరూ గట్టిగా కౌగిలించుకొని మరీ డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నరేష్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అటు సిరి హనుమంత్ ను కూడా విమర్శిస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే వీరిద్దరూ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mass Jathara: మాస్ జాతరతో ఇడియట్ లా మారిన రవితేజ.. సాంగ్ ప్రోమో వైరల్..!
ప్రమోషన్స్ లో భాగమే ఇదంతా..
ఇక నరేష్ విషయానికి వస్తే.. దివంగత దర్శకురాలు విజయనిర్మల (Vijaya Nirmala) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నరేష్ సినిమాల కంటే కూడా వ్యక్తిగతంగా ఎన్నోసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మూడు పెళ్లిళ్ల వ్యవహారంతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ముఖ్యంగా తన భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండానే ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం నడపడం అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అంతేకాదు ఏ న్యూస్ ఛానల్ చూసినా సరే వీరి గురించే చర్చించేవారు. అంతలా నరేష్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమెతోనే లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి..కానీ అందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడేమో వయసుకు మించిన పనులు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్ కొంతమంది కోరికలే గుర్రాలైతే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా నరేష్ ఇప్పుడు ఈ వయసులో కూడా ఇలా కూతురితో సమానమైన అమ్మాయితో రొమాంటిక్ స్టెప్పులు వేయడం నిజంగా విమర్శలకు దారితీస్తోంది. నిజానికి వీరిద్దరి వయసు తేడా పై ఇప్పుడు విమర్శలు గుప్పించినా.. వీరు ప్రమోషన్స్ లో భాగంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అటు సిరి హనుమంతు కూడా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ.. బిగ్ బాస్ ద్వారా కూడా భారీ గుర్తింపు సంపాదించుకుంది.
Senior Actor #Naresh Started a DIFFERENT PROMOTIONS For #Sharwanand – #Darsanamey Song 🥵🥵🥵💥💥💥#NariNariNadumaMurari – Fun Film – Arriving Soon ✅
— GetsCinema (@GetsCinema) April 11, 2025