VijayaShanti:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అటు రాజకీయంగా కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే . కాంగ్రెస్ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన విజయ శాంతి (Vijayashanti)దంపతులకు హత్యా బెదిరింపులు రావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. చంద్రశేఖర్ (Chandrasekhar)అనే వ్యక్తి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ పరువు బజారు కీడుస్తానని, తమను చంపేస్తామని బెదిరిస్తున్నాడని, విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ (Srinivas Prasad).పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయశాంతి దంపతులకు హత్యా బెదిరింపులు..ఎవరీ చంద్రశేఖర్..?
ఇకపోతే చంద్రశేఖర్ అనే వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఇకపోతే ఇతను ఎవరు? ఎందుకు వీరిని ఇలా టార్గెట్ చేశారు? అనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇక ఆ చంద్రశేఖర్ విషయానికి వస్తే విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కి కొన్ని రోజుల క్రితమే ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిచయమయ్యారట. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పడంతో విజయశాంతి అకౌంట్ ను కూడా మెయింటైన్ చేయాలని శ్రీనివాస్ కోరారు. కొన్ని రోజులపాటు విజయశాంతి గురించి ప్రచారం చేయాలని, పనితీరు నచ్చితే కాంట్రాక్ట్ చేసుకుందామని శ్రీనివాస్ ప్రసాద్ చెప్పారట..ఆ సమయంలో అతడికి కొద్ది మొత్తంలో డబ్బు కూడా అందజేశారు. కానీ అతడి పని తీరు నచ్చకపోవడంతో అతడిని ఆఫీస్ నుంచి వెనక్కి పంపించేశారు. దాంతో సైలెంట్ అయిన చంద్రశేఖర్ ఇప్పుడు శ్రీనివాస ప్రసాద్ కి మెసేజ్ చేస్తూ డబ్బులు పంపించాలని బెదిరింపులకు పాల్పడ్డారట. ముఖ్యంగా అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఇద్దరినీ చంపేస్తామని, బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఇక ముందుగా పరువు తీసి, ఆ తర్వాతే చంపేస్తానని మెసేజ్ చేస్తున్నాడట. దీంతో శ్రీనివాస ప్రసాద్ పోలీసులను ఆశ్రయించడంతో చంద్రశేఖర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’తో రీ ఎంట్రీ..
ఇకపోతే విజయశాంతి చాలా సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో మహేష్ బాబు (Maheshbabu)హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె మళ్లీ కనిపించలేదు. ఇక ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా నటిస్తున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన విడుదల కానుంది.