Mass Jathara:మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా.. భాను భోగవరపు (Bhanu Bhigavarapu) దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. ఇందులో శ్రీలీల(Sreeleela ) హీరోయిన్ గా నటిస్తుండడంతో ‘ధమాకా’ మ్యాజిక్ రిపీట్ కాబోతోంది అని అభిమానులు సైతం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ” తు మేరా లవర్” సాంగ్ ను విడుదల చేయడం కోసం తాజాగా ఈ సినిమా నుండి ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఇక ఆ ప్రోమోలో రవితేజ హీరోగా నటించిన ‘ఇడియట్’ సినిమాలోని స్టెప్పులతో ప్రోమో ఆరంభం అయ్యింది. ఇక తర్వాత శ్రీ లీల తన అంద చందాలతో మరొకసారి ప్రోమో పై హీట్ పుట్టించింది. మొత్తానికైతే మాస్ జాతర నుండి ఫస్ట్ సాంగ్ ఏప్రిల్ 14వ తేదీన విడుదల కాంబోతోంది అంటూ తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా.. ప్రోమో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నెటిజన్స్ మాస్ జాతరతో రవితేజ ఇడియట్ లా మారిపోయాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సూపర్ హిట్ సాంగ్ రీ క్రియేట్..
పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో రవితేజ(Raviteja ) హీరోగా వచ్చిన ‘ఇడియట్’సినిమాలో “చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే జాన్” అనే పాట అప్పట్లో ఎంత ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ మాస్ జాతర సినిమాలో కూడా ఈ పాటను రీమిక్స్ చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు “తూ మేరా లవర్” అనే పాట విడుదల చేస్తున్నామంటూ ప్రకటిస్తూ.. విడుదల చేసిన ప్రోమోలో కూడా ఆ పాట స్టెప్పులతోనే రవితేజ కనిపించారు. ఇక మొత్తానికైతే ఏప్రిల్ 14వ తేదీన రాబోయే ఈ పాట.. రీ క్రియేట్ చేసిన పాటే అయితే ఇక అభిమానులకు మాస్ జాతర అని చెప్పవచ్చు.
రిలీజ్ డేట్ పై అనుమానాలు..
ఇకపోతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిజానికి మే 9వ తేదీనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. మళ్లీ షూటింగ్ కారణంగా వాయిదా పడింది. అయితే కొత్త విడుదల తేదీ పై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ సినిమా జూలై 18న రిలీజ్ కాబోతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అనే విషయాలపై స్పష్టత రావాలి అంటే చిత్రబృందం రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య సక్సెస్ కోసం ఆరాటపడుతూ రవితేజ రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా ఈయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
#TuMeraLover will bring all the vintage vibes to your playlist with a lovely surprise from April 14th 🤗📷
#MassJathara #Raviteja #Sreeleela #ChoopulthoGuchi #BIGTVcinema@RaviTeja_offl @sreeleela14 @vamsi84 pic.twitter.com/ysnxNkOt6u— BIG TV Cinema (@BigtvCinema) April 12, 2025