BigTV English

War 2 Update : బాలీవుడ్ క్రేజీ సీక్వెల్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌!

War 2 Update : బాలీవుడ్ క్రేజీ సీక్వెల్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌!
War 2

War 2 : ఇప్పుడు మ‌న టాలీవుడ్ స్టార్స్ అంద‌రూ బాలీవుడ్ మార్కెట్‌పై ఫోక‌స్ చేశారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్‌, అల్లు అర్జున్ త‌మ‌దైన మార్కెట్‌ను క్రియేట్ చేసేసుకున్నారు. ఇప్పుడు అదే బాట‌లో ట్రావెల్ చేయ‌టానికి రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ రెడీ అయిపోయారు. వీరిద్ద‌రిలో రామ్ చ‌ర‌ణ్ స్ట్ర‌యిట్ బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లో ఇంకా సినిమాను అనౌన్స్ చేయ‌లేదు. అయితే యంగ్ టైగ‌ర్ మాత్రం ఈ మేట‌ర్‌లో స్పీడుగా ఉన్నార‌ని సినీ స‌ర్కిల్స్ స‌మాచారం. వివ‌రాల‌ను మేర‌కు ఎన్టీఆర్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్‌లో సినిమా చేయ‌బోతున్నారు.


భారీ చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న య‌ష్ రాజ్ ఫిలింస్ ఈ ఏడాది కూడా ప‌ఠాన్ చిత్రంతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంస్థ‌లో రూపొందిన వార్ చిత్రం కూడా భారీ విజయాన్ని ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మేక‌ర్స్ దీనికి సీక్వెల్‌ను చేయ‌టానికి రెడీ అయ్యారు. వార్ 2లో హృతిక్ రోష‌న్ న‌టించ‌టం వ‌ర‌కు ఓకే. కానీ ఆయ‌న్ని ఢీ కొట్టే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై పెద్ద డిస్క‌ష‌నే న‌డుస్తుంది. ఈ క్ర‌మంలో వార్ 2లో ఎన్టీఆర్ న‌టించ‌బోతున్నారంటూ మీడియా వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి హృతిక్‌ను ఢీ కొట్టే ప్ర‌తినాయ‌కుడిగా ఎన్టీఆర్ క‌నిపిస్తారా? లేక ఇద్ద‌రూ క‌లిసి విల‌న్స్ భ‌ర‌తం ప‌డ‌తారా? అనేది తెలియాలంటే మాత్రం వెయిటింగ్ త‌ప్పదు.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌. కాగా.. ఓ బాలీవుడ్ స్టార్‌ను విల‌న్‌గా న‌టింప చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేసుకుంట‌న్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 రిలీజ్ అవుతుంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×