BigTV English
Advertisement

Biggboss 8: శేఖర్ భాషా మనిషే కాదు.. మొదటి రోజే ఇచ్చిపడేసిన సోనియా

Biggboss 8: శేఖర్ భాషా మనిషే కాదు.. మొదటి రోజే ఇచ్చిపడేసిన సోనియా

Biggboss 8: ఎన్నాళ్లగానో ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8 నిన్న నైట్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇక ఈ సీజన్ చాలా కొత్తగా మొదలయ్యింది. ప్రతి సీజన్ లో 14 మంది కంటెస్టెంట్స్.. సింగిల్ గా వెళ్లేవారు. కానీ, ఈసారి కంటెస్టెంట్స్.. జోడీలుగా వెళ్లారు. 14 మంది కంటెస్టెంట్స్.. 7 జంటలుగా హౌస్ లోకి అడుగుపెట్టారు.


ఇక ఏ సీజన్ లో ఆడ, మగ కంటెస్టెంట్స్ సమానంగా లేరు. కానీ ఈ సీజన్ లో 7 గురు అమ్మాయిలు.. 7 గురు అబ్బాయిలను తీసుకొచ్చారు.  ఇక మొదటి రోజునే బిగ్ బాస్ హౌస్ లో గొడవలు మొదలయ్యాయి. అనిల్ రావిపూడి వెళ్లి ఒకరిని స్వాప్ చేయాలనీ అడిగినప్పుడు చాలామంది నాగమణికంఠ పేరు చెప్పడంతో అతడు.. తన పేరు చెప్పినవారిపై  కోపం పెంచుకున్నట్లు కనిపిస్తుంది.

ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో మాత్రం మొదటిరోజే గొడవ తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తుంది. ఆర్జే శేఖర్ భాషా, సోనియా మధ్య హీట్ పెంచేలా వివాదం రాజుకుంది. హౌస్ లోకి అడుగుపెట్టి.. రిలాక్స్ అయ్యిన వెంటనే కంటెస్టెంట్స్ అందరూ సరదాగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలోనే కొంతమంది అబ్బాయిలు.. ఆరెంజ్స్ తో ఆటలు ఆడుతూ కనిపించారు. వాటిని బాల్స్ లా విసురుతూ క్యాచేస్ పట్టుకుంటున్నారు.


ఇక దానికి సోనియా సీరియస్ అవుతూ.. అలా అరెంజ్స్ తో ఆడిన వారికి ఆరెంజ్స్  ఇక ఇవ్వడం కుదరదు అని సీరియస్ అయ్యింది. దానికి శేఖర్ భాషా .. రెచ్చిపోయాడు. హౌస్ లో ఫ్రూట్స్ తో ఆడుకోవద్దని చెప్పలేదని చెప్పుకొచ్చాడు. ఫుడ్ ను ఇలా కిందపడేసి తినొద్దు అని మాత్రమే చెప్పాను, నువ్వు వాటితో ఆడుకో.. డ్రైనేజ్ లో వేసుకో.. కిందేసి తొక్కుకో.. అవే తిను.. కానీ, వేరే వాళ్లకు పెట్టకు అని సీరియస్ అయ్యింది.

అంతేకాకుండా మనిషిలా తినాలనిమండిపడింది. అంటే నేను మనిషిని కాదా.. ? నీకు పెట్టొద్దు అని చెప్పు.. మిగతా వాళ్ళ గురించి ఎందుకు అని శేఖర్ సైతం రెచ్చిపోయాడు. ఇక మొదటిరోజే శేఖర్ కు సోనియా ఇచ్చిపడేసింది.

ఇక ఈ గొడవ పక్కన పెడితే.. మొదటి టాస్క్ చాలా కష్టంతో కూడుకున్నట్లు కనిపిస్తుంది. కొన్ని తాడులతో కట్టిన వాటిని కట్ చేస్తూ.. బ్యాలెన్స్డ్ గా నిలబడిన వారు గెలుస్తారు అని పట్టుకొనే ఉండండి అనే పేరుతో మొదలైన ఈ గేమ్ లో ఎవరు గెలిచారు అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.

Related News

Bigg Boss 9 Promo: రీతూ చౌదరి టాలెంట్ అదుర్స్.. అంతమాట అన్నారేంటి సార్!

Bigg Boss 9 Telugu : సింగర్ రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించడంటే..?

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Big Stories

×