BigTV English

Vijayashanti – Balakrishna: పెళ్లి తర్వాత బాలకృష్ణ విషయంలో భర్త కఠిన నిర్ణయం.. అందుకే అలా చేసిందా..?

Vijayashanti – Balakrishna: పెళ్లి తర్వాత బాలకృష్ణ విషయంలో భర్త కఠిన నిర్ణయం.. అందుకే అలా చేసిందా..?

Vijayashanti – Balakrishna:అప్పట్లో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో బాలకృష్ణ (Balakrishna ), విజయశాంతి(Vijayashanti ) జంట కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇద్దరూ కూడా తెరపై కనిపించారంటే తమ నటనతోనే కాదు డాన్స్ పెర్ఫార్మెన్స్ తో కూడా అందరిని ఆకట్టుకునేవారు. అయితే పెళ్లి తర్వాత బాలయ్యతో సినిమాలు చేయడం తగ్గించింది విజయశాంతి. దీనికి రెండు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి అంటూ గతంలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. మరి వివాహం తర్వాత విజయశాంతి బాలకృష్ణతో సినిమాలు ఎందుకు చేయలేదు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


బెస్ట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి – బాలకృష్ణ..

విజయశాంతి.. లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె, నటి మాత్రమే కాదు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది కూడా. ముఖ్యంగా వెండితెరపై శ్రీదేవి (Sridevi) తర్వాత ఆ స్థాయి ఇమేజ్ తో దూసుకొచ్చింది. చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna),నాగార్జున(Nagarjuna ) , వెంకటేష్(Venkatesh) వంటి సూపర్ స్టార్ హీరోలకు ధీటుగా తన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. వారికి పోటీగా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మెప్పించింది. ముఖ్యంగా ఈమె సినిమాలు థియేటర్ వద్ద విడుదల అవుతున్నాయి అంటే స్టార్ హీరోలు కూడా కాస్త ఆలోచించేవారు. అంతలా తన సినిమాలతో , నటనతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది విజయశాంతి. ఇకపోతే టాలీవుడ్ లో ఒక బాలకృష్ణ తోనే విజయశాంతి ఎక్కువ సినిమాలు చేసింది. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 17 సినిమాలు వచ్చాయి. ఇక దీని బట్టి చూస్తే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతలా కుదిరిందో అర్థం చేసుకోవచ్చు.. ముఖ్యంగా ఈ జంట సినిమాలో నటిస్తోంది అంటే కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అనే నమ్మకం అటు నిర్మాతలలో కూడా ఉండేది.


పెళ్లి తర్వాత బాలయ్యతో సినిమాలు తగ్గించిన విజయశాంతి..

అంతలా పాపులారిటీ దక్కించుకుంది ఈ జంట. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో చివరిగా వచ్చిన సినిమా నిప్పురవ్వ. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా రాలేదు. ఇంకా చెప్పాలి అంటే పెళ్లి తర్వాత విజయశాంతి బాలయ్యతో సినిమాలు చేయడం తగ్గించింది. దీనికి కారణం ఆమె అప్పటికే లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు టర్న్ తీసుకోవడమే అని, మరొకవైపు బిజీ కావడం వల్లే బాలయ్యతో సినిమాలు చేయలేకపోయానని ఆమె తెలిపింది. అంతేకాదు ఎక్కువ పారితోషకం కోసమే తాను లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసినట్టుగా కూడా తెలిపింది. కానీ ఈ విషయాలు ఎవరూ నమ్మలేదు. అయితే విజయశాంతి పెళ్లి తర్వాత బాలకృష్ణతో సినిమాలు చేయకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయంటూ కొంతమంది వార్తలు వైరల్ చేశారు. అందులో ఒకటి విజయశాంతి భర్త, రెండవది ఆమెకున్న ఈగో సమస్య

భర్త కండిషన్ పెట్టాడా?

విజయశాంతికి అప్పట్లో హీరోలకు మించి ఇమేజ్ ఉండేది. దీంతో సినిమా హిట్ అయితే ఎవరి వల్ల హిట్ అయిందని చర్చ వస్తే విజయశాంతి వల్లే హిట్ అయిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే హీరోలకు ఆమెకు మధ్య ఈగో సమస్య తగిలింది. అందుకే అటు చిరంజీవితో కూడా ఈ సినిమాలు చేయడం మానేసింది. మరొకవైపు విజయశాంతి పెళ్లి తర్వాత ఆమె భర్త బాలకృష్ణతో సినిమాలు చేయడంపై కాస్త అసహనం వ్యక్తం చేశాడనే వార్తలు కూడా వినిపించాయి. అలా ఏది ఏమైనా వివాహం తర్వాత విజయశాంతి, బాలకృష్ణ తో సినిమాలు చేయడం మానేయడం పై పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×