Swara Bhaskar : బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ లలో ఒకరైన స్వర భాస్కర్ (Swara Bhaskar) కు తాజాగా ఎక్స్ షాక్ ఇచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా గాంధీ గురించి చేసిన ట్వీట్ కారణంగా, ఆమె అకౌంట్ ను పర్మినెంట్ గా సస్పెండ్ చేసింది ఎక్స్. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను షేర్ చేసింది స్వర భాస్కర్. అందులో అసలు ఆ రోజు తానేం పోస్ట్ చేసింది? దానికి ట్విట్టర్ రియాక్షన్ ఏంటి? అనే విషయాలను వెల్లడించింది.
హీరోయిన్ అకౌంట్ సస్పెండ్
తన ట్విట్టర్ ఎకౌంట్ సస్పెండ్ కావడం గురించి స్పందిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది స్వరా భాస్కర్ (Swara Bhaskar). అందులో అసలేం జరిగిందో వెల్లడించింది. ఆ పోస్టులో “డియర్ ఎక్స్… నేను చేసిన రెండు ట్వీట్ లలో ఉన్న రెండు ఫోటోలు కాపీ రైట్ ఉల్లంఘన అని నాకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే నా ఎక్స్ ను బ్లాక్ చేయడం వల్ల ఇప్పుడు నేను దాన్ని యాక్సిస్ చేయలేను. కానీ అవే రెండు ఫోటోలను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. నారింజ రంగు బ్యాగ్రౌండ్ ఉన్న ఒక పిక్ లో హిందీ దేవనాగరి లిపిలో రాసిన గాంధీ మేము సిగ్గుపడుతున్నాము, మీ హంతకుడు ఇంకా బ్రతికే ఉన్నాడు అనే పాపులర్ నినాదం ఉంది. ఇదొక యాస లాంటిది. ఇందులో ఎలాంటి కాపీరైట్ సమస్య లేదు.
ఇక రెండో పోస్ట్ విషయానికి వస్తే అందులో నా బిడ్డ పిక్ ఉంది. ఆమె ముఖం కనిపించకుండా ఇండియన్ ఫ్లాగ్ ను ఎగరేస్తున్న పిక్ ను షేర్ చేశాను. దానిపై హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా అని రాసి ఉంది. ఇది అసలు ఎలా కాపీ రైట్ ఉల్లంఘన అవుతుంది? నా బిడ్డ లాంటి పోలిక వేరొకరికి ఎలా ఉంటుంది? అసలు ఈ రెండు కంప్లైంట్స్ కూడా ఏ రకంగానూ కాపీరైట్ కు సంబంధించివి కాదు” అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది స్వర భాస్కర్.
భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడమే…
అదే పోస్ట్ లో స్వర భాస్కర్ (Swara Bhaskar) “కాపీ రైట్ అంటే గనక అది వినియోగదారుని అంటే నన్ను వేధించే ప్రయత్నం అవుతుంది. దీని ద్వారా నా భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నం జరుగుతున్నట్టే. కాబట్టి దయచేసి దీని పరిశీలించి, మీ నిర్ణయాన్ని మార్చుకోండి. థాంక్స్” అంటూ స్వర భాస్కర్ ఎక్స్ కి ఇంస్టాగ్రామ్ వేదికగా రిక్వెస్ట్ చేసింది. ఇక స్వర భాస్కర్ ఎప్పటికప్పుడు తన కామెంట్స్ తో వివాదాలలో నిలుస్తూనే ఉంటుంది. చాలాకాలంగా రాజకీయాలకు సంబంధించిన అంశాలపై స్టేట్మెంట్స్ ఇస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఫిబ్రవరి 2023లో సమాజ్ వాది పార్టీ నాయకుడు ఫహద్ అహ్మద్ ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు రవియా. పెళ్లయిన అదే ఏడాది స్వర భాస్కర్ బిడ్డకు జన్మనిచ్చింది. త్వరలో ఆమె ‘మిస్సెస్ ఫలని’ అనే సినిమాలో కనిపించబోతోంది.