Bandla Ganesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా, కమెడియన్ గా, హీరోగా, నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు బండ్ల గణేష్ (Bandla Ganesh). పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వీరాభిమాని అని చెప్పుకునే ఈయన గత కొంతకాలంగా ఆయనతో సత్సంబంధాలు కొనసాగించలేకపోతున్నారు. కారణం ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అసలు వీరి ముగ్గురు మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ బండ్ల గణేష్ మాత్రం ఎప్పటికప్పుడు త్రివిక్రమ్ పై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj)!పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లకు మండిపడ్డ బండ్ల గణేష్ తాజాగా ఒక ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరు బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశారా అంటూ కామెంట్ పెడుతున్నారు.
SSMB 29: సెట్ లోనే హోలీ జరుపుకున్న యూనిట్.. ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక..!
వైరల్ గా మారిన బండ్ల గణేష్ ట్వీట్..
బండ్ల గణేష్ తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా..”కృతజ్ఞత లేకుండా బ్రతకడం మానవత్వాన్ని కోల్పోవడమే. ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే.. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తోంది. మనం ఎప్పుడు కృతజ్ఞతతో జీవించాలి” అంటూ బండ్ల గణేష్ ట్వీట్ వేశారు. ఇది చూసిన నెటిజెన్స్ పాత విషయాలను గుర్తు చేస్తూ ప్రకాష్ రాజ్ కి కౌంటర్గా బండ్ల గణేష్ ట్వీట్ వేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే, టాలీవుడ్ లో మా ఎన్నికలు జరిగినప్పుడు మంచు విష్ణు(Manchu Vishnu),ప్రకాష్ రాజ్ పోటీపడ్డారు. అయితే ఆ సమయంలో మంచు విష్ణు కి కాకుండా ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు ప్రకాష్ రాజ్ సెటైర్స్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కృతజ్ఞతతో జీవించాలి అని అన్నాడేమో అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ వేసారో తెలియదు కానీ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఇదేనేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ట్వీట్..
అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక ఈవెంట్ నిర్వహించగా అందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “తమిళులు ఎందుకు హిందీ వద్దంటున్నారో అర్థం కావడం లేదు. అయితే తమిళ్ సినిమాలు హిందీలో డబ్ చేయకూడదు. నార్త్ నుంచి డబ్బులు కావాలి కానీ నార్త్ భాష అవసరం లేదా” అంటూ మండిపడ్డారు.. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ..”మీ హిందీ భాషను మా వద్ద మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు.. స్వాభిమానంతో మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని.. పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ ” అంటూ కామెంట్ చేశారు.
“కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే,
ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే.”
ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి….!— BANDLA GANESH. (@ganeshbandla) March 15, 2025