Director Maruthi: టాలీవుడ్ డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. యూత్ ని ఆకట్టుకునే విధంగా వాళ్ళ అభిరుచులకు తగ్గట్లు సినిమాలో తీస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందాడు. ఆయన సినిమాల్లో ఒక మార్క్ ఉంటుంది. అందరిని అలరించే విధంగా సినిమాలను తెరకేక్కిస్తున్నాడు.. మొదటి చిత్రంతో మంచి మార్క్ ని సొంతం చేసుకున్న మారుతి రెండో చిత్రం బస్ స్టాప్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నాని తో, సాయి ధరంతేజ్ తోను వరుసగా సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం ఈ డైరెక్టర్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో రాజా సాబ్ మూవీ చేస్తున్నాడు. సినిమాలు పరంగా మంచి సక్సెస్ ని అందుకున్న ఈ డైరెక్టర్ రియల్ లైఫ్ లో అన్ని కష్టాలే అని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. డైరెక్టర్ మారుతి బ్యాగ్రౌండ్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
మారుతి రియల్ లైఫ్..
డైరెక్టర్ మారుతి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించాడు. అతను తన విద్యను మచిలీపట్నంలో పూర్తి చేశాడు. తరువాత మారుతి గ్రాడ్యుయేషన్ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లాడు. అతను యానిమేషన్ నేర్చుకున్నాడు.. ఆ తరువాత DQ ఎంటర్‌టైన్‌మెంట్ ఇంటర్నేషనల్‌లో చేరాడు.. అక్కడ అతను నగరంలోని మొదటి బ్యాచ్ యానిమేటర్లలో ఒకడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. డైరెక్టర్ గా ఈ రోజుల్లో సినిమాతో సక్సెస్ అయ్యాడు. అప్పటినుంచి ఆయన తీసిన ప్రతి సినిమా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. ఈయనకు 2008లో ఇతనికి పెళ్లయింది. తర్వాత యానిమేషన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగించాడు. ఈ టైంలోనే బన్నీ వాసుతో పరిచయం ఇతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాడు. కొన్ని ప్రకటనలు కూడా తీశాడు. తర్వాత దర్శకత్వం తన వృత్తిగా స్వీకరించాడు.. ఆ తర్వాత డైరెక్టర్ గా పలు చిత్రాలను తెరకేక్కించి సక్సెస్ అయ్యాడు.
కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటనలు..
మారుతి గురించి అందరికి సినిమాల పరంగా మాత్రమే తెలుసు. కానీ తన తండ్రి బ్యాగ్రౌండ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. రియల్ లైఫ్ లో అన్నీ కన్నీళ్లు కష్టాలే అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన తన ఫ్యామిలీ గురించి బయట పెట్టాడు.. ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ.. మా నాన్న అరటిపళ్ళు అమ్మేవారు. మాది చాలా పేద కుటుంబం. ఆయన రోజుకు 50 రూపాయలు సంపాదిస్తే చాలు, అదే పెద్ద మొత్తం అనుకునేవారు. నేను జాబ్ లో చేరాక నాన్నతో ఆ పని మాన్పించేశాను. నేను అన్ని పనులు చేసేవాడిని. ఆఫీస్ బాయ్ గా కూడా చేశాను.. అని మారుతి చెప్పుకొచ్చాడు… ఆ వీడియోనుప్రస్తుతం ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. దాంతో ట్రెండ్ అవుతుంది.
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..
రాజా సాబ్ మూవీ..
ఇప్పటివరకు చిన్న హీరోతో సినిమాలు చేసిన మారుతి మొదటిసారి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమాను సెట్ చేసుకొని అందరిని షాక్ అయ్యేలా చేశాడు.. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సమ్మర్ కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. రాజాసాబ్ మూవీ హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతోంది.. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ సినిమాపై భార్య అంచనాలే ఉన్నాయి మరి ఈ సినిమా ఎలాంటి టాక్ నందుకు ఉంటుందో చూడాలి ఈ సినిమా హిట్ అయితే మాత్రం మారుతి రేంజ్ పెరుగుతుంది..