BigTV English

Atlee – Allu Arjun Movie : 600 కోట్లు ఇవ్వండి… బన్నీ మూవీకి అట్లీ మెలిక..?

Atlee – Allu Arjun Movie : 600 కోట్లు ఇవ్వండి… బన్నీ మూవీకి అట్లీ మెలిక..?

Atlee – Allu Arjun Movie : పుష్ప రాజ్ మానియా పూర్తిగా అయిపోయింది. సంధ్య థియేటర్ ఘటన వల్ల పుష్ప 2 సక్సెస్‌ను సరిగ్గా సెలబ్రెట్ చేసుకోలేకపోయాడు అల్లు అర్జున్. అటు ఫ్యాన్స్ కూడా నిరాశలోనే ఉన్నారు. ఇదింత పక్కన పెడితే… ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ ఆయన అభిమానులు తర్వాత సినిమా గురించి ఆలోచిస్తున్నారు. బన్నీ తన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది..? అనే క్వశ్చన్‌కు ఇంకా సమాధానం దొరకలేదు.


త్రివిక్రమ్ తో ఉంటుందా..?
అట్లీతో ఉంటుందా..?
ఈ రెండు ప్రశ్నలతో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్. అయితే ఈ రెండు మూవీలకు ఒక్కో సమస్య ఉందట. త్రివిక్రమ్‌ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లేతో పాటు మరి కొన్ని సమస్యలు ఉన్నాయని సమాచారం.

ఇక అట్లీ మూవీకి అయితే… అట్లీ నే పెద్ద సమస్యగా మారుతున్నాడని తెలుస్తుంది. అట్లీ పెట్టే మెలికలకు గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ ఏం తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారట. ఒక్కో సందర్భంలో మొత్తం ప్రాజెక్ట్‌నే రద్దు చేయాలని కూడా అనుకున్నట్టు తెలుస్తుంది.


నిజానికి అన్నీ కుదిరితే… పుష్ప 2 తర్వాత ఎలాంటి డౌట్, ఎలాంటి క్వశ్చన్స్ లేకుండా… అట్లీ మూవీ స్టార్ట్ కావాల్సింది. బన్నీ కోసం స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం రెడీ చేసుకుని పెట్టాడు అట్లీ. అయితే సమస్య అంత అట్లీతోనే ఉందని టాక్ వస్తుంది.

చాలా రోజుల నుంచి వినిపిస్తున్నట్టు రెమ్యునరేషన్ ఒకటి అయితే… మరొకటి సినిమాకు మొత్తం కలిపి ఒకే సారి 600 కోట్లు తన చేతిలో పెట్టమని నిర్మాత అల్లు అరవింద్ తో చెబుతున్నారట.

ఈ 600 కోట్లల్లోనే మూవీకి సంబంధించిన బడ్జెట్‌తో పాటు అట్లీ రెమ్యునరేషన్ కూడా ఉంటుందట. సినిమా కోసం 500 కోట్లు కేటాయించి… మిగితా 100 కోట్లు తన పారితోషికం కింద జమ చేసుకుంటాడట. బడ్జెట్ 500 కోట్లు అట్లీ చేతికి వచ్చిన తర్వాత… అల్లు అరవింద్ ఎంట్రీ ఇక ఉండదట. సినిమా పూర్తి చేసి అల్లు అరవింద్ చేతికి ఇస్తాడట. అప్పటి వరకు సినిమా ఏంటి…? బడ్జెట్ ఏంటి.?? అనే ప్రశ్నలు అట్లీ ముందుకు రాకూడదు అనేది ఓ షరుతు ఉన్నట్టు టాక్ వస్తోంది.

అలాగే… అట్లీకి 100 కోట్ల రెమ్యునరేషన్ ఏంటి అనేది మరో సమస్య. స్టార్ హీరోలే 100 కోట్లు తీసుకోవడం లేదు. అలాంటిది ఇప్పుడు అట్లీ 100 కోట్లు ఇస్తే పరిస్థితేంటి అనే డైలామాలో పడిపోయారట.

అలాగే బన్నీ ఎంత కాదు అన్నా… 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. సొంత బ్యానర్.. తండ్రే నిర్మాత అయినా… బన్నీకి ఇవ్వాల్సినవి ఇవ్వాల్సిందే. పైగా ఇప్పుడు బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రతి విషయాన్ని నేషనల్ మీడియా కౌంట్ చేసి కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి… తండ్రి దగ్గర అయినా… కూడా తన రెమ్యునరేషన్ తగ్గించుకోడు.

అలా చేస్తే అట్లీ అడుగుతున్న 600 కోట్లు, బన్నీతో పాటు ఇతర నటీనటులకు అయ్యే రెమ్యునరేషన్ ఖర్చులు.. ఇలా అంతా కలిపి… 800 నుంచి 850 కోట్ల వరకు అయ్యే ఛాన్స్ ఉంది.

ఇంత మొత్తాన్ని అల్లు అరవింద్ పెట్టగలడా..? అవును… అల్లు అరవింద్ ఇప్పటి వరకు చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తాడు. బడ్జెట్ కూడా అలాగే కేటాయిస్తాడు. ఇప్పటి వరకు అల్లు అరవింద్ నుంచి భారీ బడ్జెట్ మూవీ అంటే… అది తండేల్ మాత్రమే. ఈ మూవీకి దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇప్పుడు త్రివిక్రమ్ అండ్ అట్లీ సినిమాకు భారీగానే ప్లాన్ చేసుకున్నారు. కానీ… మరీ ఇంత చేయడానికి అల్లు అరవింద్ రెడీగా ఉన్నాడా..? అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇవన్నీ ఎందుకు… అట్లీ మూవీని కొద్ది రోజులు పక్కన పెట్టి… త్రివిక్రమ్ సినిమా ముందుకు తీసుకెళ్లే ఆలోచన కూడా రావొచ్చు.

కాగా… గతంలో అట్లీ ఇలాంటి ఒప్పందోనే ఓ మూవీ చేశాడు. అదే జవాన్. తన రెమ్యునరేషన్ కాకుండా… ఓన్లీ సినిమా నిర్మాణానికి 300 నుంచి 400 కోట్లను నిర్మాతల నుంచి తీసుకున్నాడట. మొత్తం సినిమా పూర్తి చేసిన తర్వాతే ఆ నిర్మాణానికి సంబంధించిన లెక్కలు చెప్పాడట. అయితే ఆ మూవీ నిర్మాతలకు భారీగా లాభాలను తీసుకొచ్చింది. 1150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దీంతో అట్లీ ఒప్పందం గురించి పెద్దగా బయటికి రాలేదు.

కానీ, ఇప్పుడు అల్లు అర్జున్ మూవీకి చర్చల సమయంలోనే 600 కోట్లు అడగడం వల్ల ఈ విషయం బయటికొచ్చింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×