Teenmaar Mallanna Suspended: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తీన్మార్ మల్లన్నకు గతంలో షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇప్పటివరకు ఆయన సమాధానం చెప్పలేదు. ఇప్పటికీ పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు తీన్మార్ మల్లన్నపై వేటు వేశారు.
వివరాల్లోకి వెళ్తే.. పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని తెలంగాణ కాంగ్రెస్ మరోసారి నిరూపించింది. ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తీన్మార్ మల్లన్న TPCCకి గతంలోనే అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 6వ తేదీన నోటీసు జారీ చేసింది. ఆ నోటీసులకు 12వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఆ నోటీసులను తీన్మార్ పట్టించుకోలేదు.
కాంగ్రెస్ తీరు బీసీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ఉందన్నారు మీడియా ముందు తీన్మార్ మల్లన్న. రాహుల్ గాంధీ బాటలో పయనిస్తూ బీసీల గురించి మాట్లాడితే.. షోకాజ్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. కొందరు నేతలు బీసీలను పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సమాధానం చెప్పకపోవడంతో.. ఇప్పటికీ పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు తీన్మార్ మల్లన్నపై వేటు వేశారు. తెలంగాణ కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చిన మరుసటి రోజే వేటు పడింది. దాంతో పార్టీ లైన్ దాటిన వారిపై వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చింది.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదన్నారు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించాం. బీసీ కులగణన ప్రతులు చించివేయడంపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టం’’ అని పేర్కొన్నారు.
Also Read: ఎనిమిది మంది ఆనవాళ్లు దొరికాయి.. ఇక ఏ క్షణమైనా..
బీసీల మనోభావాలు దెబ్బతినేలా కులగణన నివేదికను తగలబెట్టినందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. హన్మకొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఓ సామాజికవర్గంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తన మార్క్ చూపించారు. శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆమె పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జవాబు ఇవ్వకపోవడంతో పార్టీ చర్యలు తీసుకుంది.ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది.