Matthew Short Injury: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా శుక్రవారం వర్చువల్ నాకౌట్ మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్గనిస్తాన్. ఈ మ్యాచ్ లో పట్టుదలగా బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్.. ఓవైపు వికెట్లు పడుతున్నా.. బ్యాటర్లంతా తలా ఓ చేయి వేయడంతో ఆ జట్టు ఆస్ట్రేలియా ముందు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది.
ఆ జట్టు స్టార్ ఒపెనర్ రెహమానుల్లా గుర్బాజ్ డకౌట్ అయ్యాడు. ఇక గత మ్యాచ్లో భారీ సెంచరీ తో ఆకట్టుకున్న ఇబ్రహీం జద్రాన్.. ఈ మ్యాచ్ లో మంచి శుభారంభం అందించాడు. కానీ భారీ ఇన్నింగ్స్ మాత్రం ఆడలేకపోయాడు. 28 బంతులలో 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం సెదిఖుల్లా 95 బంతుల్లో 85 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఆ తర్వాత ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఓమర్జాయ్ 67 పరుగులు చేయడంతో ఆఫ్గనిస్తాన్ జట్టు 273 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా జట్టు 12.5 ఓవర్లలో 109/1 వద్ద ఉండగా వర్షం ఆటకి అంతరాయం కలిగించింది. ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించాలంటే ఇంకా 165 పరుగులు అవసరమైన స్థితిలో వర్షం ఆటంకం కలిగించడంతో ఇక ఆట కొనసాగలేదు. దీంతో ఈ మ్యాచ్ లో ఫలితం తేలక పోవడంతో ఆఫ్ఘనిస్తాన్ సెమిస్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. అయితే సెమీ ఫైనల్ కీ దూసుకు వెళ్లిన ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది.
ఆ జట్టులోని కీలక ప్లేయర్ సెమీస్ కి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ మ్యాథ్యూ షార్ట్ {Matthew Short Injury} గాయపడ్డాడు. దీంతో అతడు మార్చి 4న జరగబోయే సెమీఫైనల్ లో ఆడతాడా..? లేదా..? అన్నది అనుమానంగా మారింది. మ్యాథ్యూ షార్ట్ గాయం {Matthew Short Injury} తీవ్రతపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. అతడు కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చుని తెలిపాడు.
ఇక ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో మ్యాథ్యూ ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతులలో 20 పరుగులు చేశాడు. అలాగే ఈ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడిన రెండు మ్యాచ్లలో 102 స్ట్రైక్ రేటుతో 83 పరుగులు చేశాడు. ఒకవేళ అతడు సెమీఫైనల్ లో జట్టుకి దూరమైతే {Matthew Short Injury} అతడి స్థానంలో ఎవరు ఆడతారు అనేది క్లారిటీ లేదు. కానీ అతడి స్థానంలో జేక్ ఫ్రెజర్ లేదా మెక్ గుర్క్ ఆడవచ్చని సమాచారం. ఇక ఆఫ్గనిస్తాన్తో మ్యాచ్ ఫలితం అనంతరం ఆశ్చర్య ఖాతాలో నాలుగు పాయింట్లు {0.475}, సౌత్ ఆఫ్రికా ఖాతాలో మూడు పాయింట్లు {2.140}, ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో మూడు పాయింట్లు {-0.990} ఉన్నాయి. ఈ గ్రూపులో ఉన్న నాలుగవ జట్టు ఇంగ్లాండ్.. తొలి రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో టోర్నీ నుండి నిష్క్రమించింది.
Another setback for Australia as their batting all-rounder, Matthew Short is expected to miss the semi-final of the ICC Champions Trophy 2025 due to a quad injury.#MatthewShort #ChampionsTrophy #CricketTwitter pic.twitter.com/tfTAE7rpo1
— InsideSport (@InsideSportIND) March 1, 2025