EPAPER

Akkineni Nagarjuna: నిజంగా నాగార్జున.. కోడలి విషయంలో అలా చేసి ఉంటారా?

Akkineni Nagarjuna: నిజంగా నాగార్జున.. కోడలి విషయంలో అలా చేసి ఉంటారా?

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి లేదు. టాలీవుడ్ ను నడిపిస్తున్న నాలుగు ఫ్యామిలీస్ లో అక్కినేని కుటుంబం ఒకటి. అక్కినేని నాగేశ్వరావు వదిలి వెళ్లిన లెగసీని ఆయన వారసుడుగా  నాగార్జున కొనసాగిస్తున్నాడు. ఇక నాగార్జున ఎంత మంచి నటుడో.. అంతే  పెద్ద బిజినెస్ మ్యాన్. ఇప్పటివరకు నాగార్జున నికర ఆస్తుల విలువ అక్షరాలా  రూ.3010 కోట్లు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి.  ఇక అంత ఆస్తిని పెట్టుకొని నాగార్జున.. కోడలు సమంత విషయంలో ఇంత నీచానికి దిగజారతాడా.. ? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది.. ? ఇప్పుడు సమంత విషయంలో నాగార్జున ఏం చేశాడు.. ? అనేది తెలుసుకుందాం రండి.


నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య.  జోష్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.  ఆ తరువాత ఏ మాయ చేసావే సినిమాతో చై.. హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. కొడుకులను హీరోలుగా నిలబెట్టడానికి నాగార్జున పడే కష్టం దేవుడికే తెలియాలి. సినిమాలు విషయంలోనే కాదు.. వారి వ్యక్తిగత విషయాల్లో కూడా నాగ్ చాలా ఆచితూచి అడుగులు వేస్తాడు. అలా అని కొడుకుల మనసులను నొప్పించే పని ఎప్పుడు చేయడు. అలానే  చై, సమంతను ప్రేమించానని చెప్పగానే మొదట సంతోషపడింది నాగ్ నే. ఆ విషయం ఆయన ఎన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.

ఇక చై -సామ్ ల పెళ్లిని  నాగార్జున దగ్గరుండి ఎంతో గ్రాండ్ గా జరిపించాడు. రెండు రోజులు.. రెండు విభిన్నమైన సంప్రదాయాల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సమంత వచ్చాక తనకు కూతురు లేని లోటు  పోయిందని నాగ్ చెప్పుకొచ్చాడు. సామ్ సైతం నాగ్ మామ అంటూ ఎంతో ప్రేమగా  పిలిచేది. మామకోడలు కలిసి రాజు గారి గది 2 అనే సినిమాలో కూడా నటించారు. అటు అక్కినేని కుటుంబంలో.. ఇటు దగ్గుబాటి కుటుంబంలో సమంత ఉన్నప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు  లేదనే చెప్పాలి. ఇక ఏమైందో ఏమో తెలియదు కానీ, సమంత- నాగ చైతన్య నాలుగేళ్లు నిండకుండానే విడాకులు తీసుకున్నారు. అందుకు కారణాలు ఇవే అంటూ చాలా రూమర్స్ వచ్చాయి.


కొడుకు- కోడలు విడిపోవడంపై నాగార్జున కూడా స్పందించాడు. అది వారి వ్యక్తిగత నిర్ణయమని,  ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందని తెలిపాడు. అంతేకాకుండా సమంతకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకున్నాడు కూడా. ఇకదాని తరువాత సామ్ గురించి నాగ్ ఎప్పుడు మాట్లాడింది లేదు. ఈ మధ్య చై- శోభితా ఎంగేజ్ మెంట్ అప్పుడు మాత్రం .. సమంత వెళ్ళాక   చై చాలా సఫర్  అయ్యాడని, సామ్ వెళ్లాక ఇప్పుడే సంతోషంగా ఉన్నాడని తెలిపాడు.

ఇక ఈ మధ్య అక్కినేని కుటుంబాన్ని కుదిపేసిన వార్త N కన్వెన్షన్  కూల్చివేత. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. N కన్వెన్షన్ ను చెరువును కబ్జా చేసి కట్టారని  దాన్ని కూల్చివేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కూడా నాగ్ ఎంతో సమన్వయం పాటిస్తూ..  “మేము ఏ చెరువును కూల్చలేదు.. ఈ సమస్య విషయమై  గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పు కి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను” అని చెప్పి సైలెంట్ అయ్యాడు.

ఇక అంతా సవ్యంగా ఉన్న సమయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని రోడ్డున  పడేశాయి. “అక్కినేని నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కారణం కేటీఆర్. N కన్వెన్షన్ ను కూల్చకుండా ఉండాలంటే సమంతను నా దగ్గరకు పంపాలని నాగార్జున, కేటీఆర్ ను అడిగాడు. నాగార్జున దానికి ఒప్పుకొని సమంతను, కేటీఆర్ దగ్గరకు వెళ్లమని అడగ్గా.. ఆమె నో చెప్పింది.  తాము చెప్పినట్లు చేయాలి, లేదంటే విడాకులు ఇవ్వాలని సమంతకు ఒత్తిడి తేవడంతో.. ఆమె విడాకులు తీసుకుంది” అని ఆరోపించారు.

మంత్రి కొండా సురేఖ వ్యాక్యలపై నాగార్జున స్పందించిన విషయం కూడా తెల్సిందే. “గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఇదంతా బాగానే ఉన్నా.. అసలు అంత  ఆస్తి పెట్టుకొని, నాగార్జున కోడలు విషయంలో ఇంత నీచానికి దిగజారతాడా.. ? అనే మాటలు వినిపిస్తున్నాయి.

కొండా సురేఖ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు.  కేటీఆర్ మీద నిందలు వేయడానికి సమంత పేరు తీసుకురావాల్సిన అవసరం ఏంటి.  నిజంగానే సమంత  విడిపోవడానికి ఇది కారణమా.. ? ఆమె ఎలా ఇలాంటి సున్నితమైన విషయాన్ని మీడియా ముందు మాట్లాడారు.. ? ఇదే నిజమని ప్రజలు నమ్మితే.. అక్కినేని కుటుంబం పరిస్థితి ఏంటి..  ? నాగార్జున బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు. కానీ, కూతురులాంటి కోడలి విషయంలో ఇంత నీచంగా అయితే ప్రవర్తించి ఉండడు. వారు విడిపోవడానికి వారి కారణాలు వేరేవి ఉండొచ్చు అని  అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ వివాదం ముదిరి ముదిరి ఎక్కడకు దారి తీస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

Related News

Sri Vishnu : “అల్లూరి” డిస్ట్రిబ్యూటర్స్ న్యాయపోరాటం… రెండేళ్లు దాటినా పట్టించుకోని ప్రొడ్యూసర్

Vettaiyan : నటీనటుల రెమ్యునరేషన్ ఎంతంటే.. ఎవరికి ఎక్కువ అంటే..?

Sarangapani Jathakam : ‘సారంగపాణి’ జాతకం కాదు… ముందు ఇంద్రగంటి, దర్శిల జాతకం మారాలి

SD18 : సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది..స్పెషల్ వీడియోతో ట్రీట్ అదిరింది మామా…

Shraddha Kapoor: పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. గంతకు తగ్గ బొంతే..!

Sandeep Reddy Vanga With RGV : రెండు సినిమా పిచ్చి ఉన్న జంతువులు, అనిమల్ పార్కులో కలిసాయి

Aadhi Sai Kumar: కెరియర్ లో ఉన్నది ఒకటే హిట్ సినిమా, అదే మళ్లీ రీ రిలీజ్

Big Stories

×